Bhatti Vikramarka ( image CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Bhatti Vikramarka: రాష్ట్రంలో రూ.20వేల కోట్లతో కొత్త రోడ్లు

Bhatti Vikramarka: రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ రాబోతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 20వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం, మరమ్మతు, విస్తరణ పనులు చేపట్టబోతున్నామన్నారు. రోడ్ల నిర్మాణంతో (Rtc) ఆర్టీసీలో సురక్షితంగా ప్రయాణంతోపాటు సుఖమైన రవాణాకు అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. కాగా, ఆర్టీసీలో 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్లు ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా (mgbs)ఎంజీబీఎస్‌లో మహాలక్ష్మి సంబురాలను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధ్యక్షతన నిర్వహించారు.

 Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)  అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి నిలదొక్కుకుందన్నారు. 200 కోట్ల ప్రయాణాలకు అయిన ఖర్చు 6,680 కోట్లు ఆడబిడ్డల పక్షాన ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆడబిడ్డల ఆర్టీసీ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందన్నారు.

2,400 కొత్త బస్సులు

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని తెలిపారు. ఒకప్పుడు ఆర్టీసీ(RTC)  ఆర్క్యూపెన్సి రేషియో 60 శాతంగా ఉంటే మహాలక్ష్మి పథకం ద్వారా అది 97 శాతానికి పెరిగిందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఆర్టీసీలో 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు వారి సంఖ్య 65 లక్షలకు చేరుకుందని వివరించారు. హైదరాబాద్‌లో కాలుష్యం పెరుగుతుందని, ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలో ఉన్న డీజిల్ బస్సులను హైదరాబాద్ నగరం బయటకు దశలవారీగా షిఫ్ట్ చేస్తున్నామన్నారు. నగరంలో ఉన్న బస్సుల్లో 11 శాతం బ్యాటరీ బస్సులను జత చేశారు. ఇప్పటికే మూడు వేల బ్యాటరీ బస్సులను ఆర్డర్ ఇచ్చారని, మరో 500 బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు.

కొత్త బ‌స్సుల‌ కొనుగోలు.. నియామ‌కాలు
మ‌హిళ‌ల దైనందిన జీవితంలో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం భాగ‌మైనదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మ‌హిళ‌లు 200 కోట్ల ప్రయాణాలు చేసిన సంద‌ర్భంగా రాష్ట్రంలోని 97 డిపోలు, 324 బ‌స్ స్టేష‌న్లలో వేడుక‌ల‌ను నిర్వహిస్తున్నామ‌న్నారు. పెరిగిన ర‌ద్దీకి అనుగుణంగా కొత్త బ‌స్సుల‌ను కొనుగోలుతో పాటు నియామ‌కాల‌ను చేప‌డుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన ర‌వాణా స‌దుపాయం, ఉద్యోగుల సంక్షేమానికి టీజీఎస్ ఆర్టీసీ(RTC) ప్రాధాన్యత ఇస్తున్నద‌ని చెప్పారు. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ర‌వాణా వ్యవ‌స్థను బ‌లోపేతం చేసే దిశ‌గా ప్రతి గ్రామం నుంచి మండ‌లానికి, మండ‌ల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కొత్త ర‌హ‌దారుల నిర్మాణాన్ని త్వర‌లోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణ స‌దుపాయం వ‌ల్ల మహిళలు త‌మ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకోవ‌డంతో పాటు ఆర్టీసీకి కూడా మేలు జ‌రుగుతున్నదన్నారు.

 Also Read: Private schools in Gadwal: ప్రైవేట్ బడుల్లో జోరుగా దందా.. పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

Just In

01

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

Warangal District: హన్మకొండలో అతిపెద్ద దుర్గామాత మట్టి విగ్రహం.. ఎత్తు ఎంతో తెలుసా..!

Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!