Bandi sanjay: ఒక్కరి కోసం పార్టీ నిబంధనలు మారవని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఇటీవల గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘వ్యక్తి కోసం పార్టీ నిబంధనలు మారవు. అధిష్ఠానం ఇచ్చిన సూచనలు, ఆదేశాల మేరకే రాష్ట్ర, జిల్లా, మండల, బూత్ కమిటీలు వేస్తారు. ఓ పద్ధతి ప్రకారమే అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి’’ అన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మంచి నాయకుడని, కానీ ఎవరో ఆయనను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల పలు జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. అయితే గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తులకు కాదని ఇతరులకు కట్టబెట్టడంపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తాను సూచించానని, తన సూచనని పక్కన పెట్టి… ఎంఐఎం నేతలతో తిరిగే వాళ్లకి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక పార్టీలో తన నిర్ణయాలకు విలువ లేకుండా పోతోందని, అవమానాలు ఎదుర్కుంటున్నాననేలా వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
JC Prabhakar Reddy: నటి మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు… జేసీపై కేసు నమోదు
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ నివాసంలో పోలీసుల సోదాలు