తెలంగాణ: Balmuri venkat on BRS: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్టుంటే BRS నేతలకు కడుపుమంట mlc బల్మూరి వెంకట్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నిరుద్యోగులకు సంబంధించి పాత, కొత్త నోటిఫికేషన్లు, వేసి 57 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసంమని, BRS అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని అన్నారు. గతంలో బల్మూరి వెంకట్ NSUI అధ్యక్షుడుగా పోరాటం చేసి, నోటిఫికేషన్లు వేయాలని పోరాటం చేశాం అని గుర్తు చేశారు. గతంలో గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై న్యాయ స్థానం ఆశ్రయిస్తే, భయంతో చేసిన తప్పును BRS ప్రభుత్వం, TSPSC అధికారులు ఒప్పుకోని పరీక్షలు రద్దు చేశారు.
మొదటి నుంచి గ్రూప్ 1 పై BRS నేతలు వరుసగా కేసులు వేస్తూ వస్తున్నాకని అన్నారు. మొదటి నుంచి నోటిఫికేషన్లు ఆపాలని, ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నారూ. గత పదేళ్లలో మేము చేయలేక పోయాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాలు పూర్తి చేస్తుంటే చూసి తట్టుకోలేక పోతున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎప్పుడూ విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్సీ కవిత గత పదేళ్లు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదని అన్నారు. TSPSC పేపర్లు లీకు అయినప్పుడు, inter పేపర్లు లీకు అయితే, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కవిత కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. అప్పుడు mlc కవిత లిక్కర్ బిజినెస్ లో చాలా బీజీగా ఉన్నారని అన్నారు. TGPSC పరీక్షల సెంటర్ల ఏర్పాటు, విషయంలో కమీషన్ ప్రమేయం ఉండదు.
Also Read: Chamala Kiran Kumar: జోకర్లుగా ఆ పార్టీ నాయకులు.. ఎంపీ హాట్ కామెంట్స్!
ప్రభుత్వ ప్రమేయం ఉండదు. పబ్లిక్ డొమైన్ లో ఉన్నా సమాచారాన్ని కూడా mlc kavitha తప్పుగా చెప్పుతూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదు. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, విమెన్ సెంటర్ విషయంలో కవిత తప్పుడు లెక్కలు చెప్పటం హాస్యపదంగా వుందని ఎద్దేవ వేశారు. కోఠి సెంటర్ లో మాల్ ప్రాక్టీస్ జరిగింది అని చెబుతున్నారు, నిజంగా జరిగితే తోటి విద్యార్థులు ఎందుకు బయట చెప్పలేదు. విషయాన్ని అప్పుడే ఎందుకు brs నేతలు బయట పెట్టలేదు. తెలంగాణ ఉద్యమ సమయములో కూడా BRS నేతలు నిరుద్యోగుల బలిదానాతో అధికారంలోకి వచ్చి వారిని మోసం చేశారు.
ఇప్పుడు మరోసారి రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనుకోవడం దారుణం అని అన్నారు. 2017 నుంచి 2023 వరకు 14 వేల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలను నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేశారు. 8 ఏండ్లుగా పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన BRS నేతలు ఇప్పుడు వాటిని ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుంటే తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారు. నోటిఫికేషన్లు ఎవరు వేశారని చూడకుండా, పెండింగ్ లో ఉన్నా నోటిఫికేషన్లు రీ నోటిఫికేషన్ చేసి, కోర్టు కేసులను పరిష్కరించి, ఉద్యోగాలు కల్పిస్తుంటే BRS నేతలకు మాటలు రావడం లేదు అని అన్నారు.
ఎక్కడ బయటకు వస్తే ప్రజలు తిరగబడతారనే kcr భయటకు రావడం లేదు. BRSలో కవిత, కేటీఆర్ ఒకరికి ఒకరీతో పోటీ పడుతున్నారు, ఆధారాలు ఉంటే mlc కవితను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడిస్టాం. తప్పులు జరిగితే ఆధారాలతో నిరూపిస్తే ప్రభుత్వం సరిదిద్దుతుంది అని, ఇలాగే మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు రాళ్లతో తరిమికొట్టే పరిస్తితి వస్తుందని అన్నారు.
Also Read: Kavitha – CM Revanth Reddy: సీఎం రేవంత్ కు కవిత రిక్వెస్ట్.. ఎందుకింత మార్పు?