Chamala Kiran Kumar (imagecredit:twitter)
తెలంగాణ

Chamala Kiran Kumar: జోకర్లుగా ఆ పార్టీ నాయకులు.. ఎంపీ హాట్ కామెంట్స్!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Chamala Kiran Kumar: బీఆర్ ఎస్ నాయకులు జోకర్లుగా మారిపోయారని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ అండ్ టీమ్ కు మైక్ ల ముందు వాగుడు తప్ప, సబ్జెక్ట్ తెలియదన్నారు.కానీ కాంగ్రెస్ పార్టీకి చట్టంపై గౌరవం ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేటీఆర్ కు నిద్ర పట్టడం లేదన్నారు. ఏదో ఒక సాకుతో తప్పుడు ప్రచారాలతో రేవంత్ రెడ్డిని గద్దె దించాలని బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు.

కానీ అది భ్​రమ గానే నిలిచిపోతుందన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్ ఎస్, బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై కోర్టు సీరియస్, మొట్టికాయలు అనేవి కేవలం బీఆర్ ఎస్ చేస్తున్న గ్లోబెల్ ప్రచారాలే అని వివరించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తమ పార్టీ అధినాయకత్వం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

కులాల వారీగా భూములు కేటాయించినప్పుడు గతంలో బీఆర్ ఎస్ పార్టీపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఏకంగా గతంలో చీఫ్ సెక్రటరీ గా పనిచేసిన సోమేష్ కుమార్ ను కూడా కోర్టు హెచ్చరించిందన్నారు. హెచ్ సీయూ అంశంలో ఏఐ ఫోటోలతో అవాస్తవాలను చిత్రీకరించారన్నారు. హెచ్ సీయూ భూములపై వాస్తవాలను వెల్లడిస్తే బాగుంటుందని ఆయన నొక్కి చెప్పారు.

Also Read: Palm Oil In Khammam: పామాయిల్ మొక్కలతో రైతులు విలవిల.. లెక్కచేయని అధికారులు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?