Rajiv Yuva Vikasam Scheme (Image Source: Twitter)
తెలంగాణ

Rajiv Yuva Vikasam Scheme: ఈ తప్పు అస్సలు చేయవద్దు.. 5 ఏళ్లు ఈ పథకానికి దూరమే!

Rajiv Yuva Vikasam Scheme:  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam Scheme) ఒకటి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ స్కీమ్ ద్వారా లబ్దిదారులకు అవసరమైన ఆర్థిక సాయం చేయడమే కాకుండా వారి నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ సైతం అందించనున్నారు.

రూ. 4 లక్షల వరకూ రుణాలు
ఈ పథకం అర్హులకు రూ.50,000 నుంచి రూ. 4,00,000 వరకూ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఇందులో 90% వరకూ ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. మిగిలిన 10% లోన్ రూపంలో లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి అన్ని కులాలు, మతాల వారిని అర్హులే. ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారు సైతం రాజీవ్ యువ వికాసం పథకానికి కోసం అప్లై చేసుకోవచ్చు.

ఐదు గ్రూపులుగా విభజన
ఇదిలా ఉంటే ఆర్థిక సాయాన్ని రేవంత్ సర్కార్.. ఐదు గ్రూపులుగా విభచిందింది. మెుదటి దాంట్లో యూనిట్ కాస్ట్ ఆర్థిక సాయాన్ని రూ.50,000 వరకూ నిర్ణయించారు. దీనికి 100% సబ్సిడీతో ఈ ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే రెండో యూనిట్ కాస్ట్ ను రూ.50,001 – రూ.1,00,00 (90% సబ్సిడీ), మూడో గ్రూప్ లో 1,00,0001-2,00,000 (80% సబ్సిడీ), నాలుగో గ్రూప్ లో రూ.2,00,001 – 4,00,000 ఆర్థిక సాయాన్ని నిర్ణయించారు. లబ్దిదారుల ప్రాధాన్యతలు, వారికున్న అర్హతలను బట్టి వారికి ఈ కేటగిరీల కింద ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

ఈ తప్పు చేయకండి!
రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకునేవారు తప్పనిసరిగా కొన్ని డాక్యూమెంట్లను అందించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదార్ పాస్ పుస్తకం తదితర డాక్యుమెంట్లు తప్పనిసరి అని చెబుతూ ఇప్పటికే బోలెడు కథనాలు వచ్చాయి. అయితే పథకం కింద అతి ముఖ్యమైన కండీషన్ ఒకటి ఉంది. దానిని పొరపాటున అతిక్రమిస్తే రావాల్సిన ఆర్థిక సాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఒక ఇంటికి ఒక లబ్దిదారుడు మాత్రమే.

Also Read: Gold Rate Today : షాకిస్తున్న గోల్డ్.. నేడు రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు?

ఒకరికే ఛాన్స్!
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఒక ఇంటికి ఒక లబ్దిదారుడు మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుంది. అలా కాకుండా ఒక ఇంట్లో ఇద్దరు యువత ఉపాధి కోసం ఈ పథకానికి అప్లై చేసుకుంటే అసలుకే మోసం వచ్చే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకే ఇంటి నుంచి రెండు దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేసింది. ఒకవేళా ఆ ఇంటికే రెండోసారి పథకం వర్తించాలంటే 5ఏళ్ల కాల వ్యవధిని నిర్ణయించారు. కాబట్టి అర్హులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.

Also Read This: Good News To Students: విద్యార్థులకు ఈ న్యూస్ తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు.. అదేంటంటే?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు