Good News To Students: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు వెళ్ళే విద్యార్థులకు గుడ్ న్యూస్ .. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.ఈ న్యూస్ తెలిస్తే పిల్లలు ఎగిరి గంతేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మర్ హాలిడేస్ కోసం ఎదురు చూసే పిల్లలకు ఇది గొప్ప శుభవార్త అనే చెప్పుకోవాలి. మరి కొద్దీ రోజుల్లో పిల్లలు వేసవి కాలం సెలవులతో ఎంజాయ్ చేయనున్నారు.
Also Read: Gaddar Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ.. నామినేషన్స్ వివరాలివే!
ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి, మరో వైపు అకస్మాత్తుగా వానలను పడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ ఏడాదికి సంబందించిన విద్యా సంవత్సరం ఏప్రిల్ 23 తో ముగియడంతో టీచర్స్ , పేరెంట్స్ టూర్లు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు.
Also Read: Notices to Smita Sabharwal: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై.. ఓ ఐఏఎస్ అధికారికి నోటీసులు!
తెలంగాణ విద్యా శాఖ విడుదల క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 24, 2025 నుండి సెలవులు మొదలయ్యి తిరిగి జూన్ 12, 2025న పునః ప్రారభించాలని తెలిపింది. ఇలా పిల్లలకు మొత్తం 46 రోజుల పాటు వేసవి సెలవులు రానున్నాయి. సెలవులను దృష్టిలో పెట్టుకుని తల్లి దండ్రులు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్నేహితులతో ఈతలకు వెళ్ళకుండా ఇంటి వద్ద ఉండేలా చూసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఇంకో వైపు ఏప్రిల్ 24 కంటే ముందుగా ప్రైవేట్ స్కూల్స్ కి ముందుగా సెలవులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ ని క్లిక్ చేయగలరు