Maoist Encounter: మావోయిస్టు కమాండర్ పాపారావు దుర్మరణం
బీజాపూర్ స్వేచ్ఛ: మావోయిస్టు పార్టీలో కమాండర్‌గా పనిచేస్తున్న పాపారావు (Maoist Encounter) శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Maoist Encounter) మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో ఆ కోణంలో కూంబింగ్ ఆపరేషన్లు భద్రత బలగాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజాపూర్ జాతీయ ఉద్యానవనం పరిధిలోని అటవీ ప్రాంతంలో డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా బలగాల సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ నేపథ్యంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాపారావు మృతి చెందినట్లుగా విశ్వసనీయ సమాచారం. పాపారావుతో పాటు మరో మావోయిస్టు కూడా హతమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
పాపారావు నేపథ్యం ఇదీ
పాపారావు అలియాస్ చంద్రయ్య, అలియాస్ మంగుగా గుర్తింపు పొందారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పాపారావుపై రూ.1 కోటి రివార్డు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పాపారావు అనేక ఎన్‌కౌంటర్లు, దారుణమైన దాడుల్లో పాల్గొన్నాడని వివరించారు. గత ఏడాది అతడి భార్య ఊర్మిళ కూడా బీజాపూర్‌లోనే ఎన్‌కౌంటర్‌లోనే మృతి చెందింది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని భద్రతా పలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. దేశవ్యాప్త మావోయిస్టు నిర్మాణ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నేపథ్యంలో భద్రతా పలగాలు విస్తృతమైన ఆపరేషన్లను వేగవంతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లుగానే 31 మార్చి 2026 లోపు భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు అన్ని రకాల వనరులను, నూతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకుని మావోయిస్టులను మట్టు పెడుతూ వస్తున్నారు. బీజాపూర్‌లో ఇంకా డీఆర్జీ, కోబ్రా భద్రత బలగాలు సంయుక్తంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు.
Read Also- Teachers Tragedy: ఉపాధ్యాయుల కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి..!

