Euphoria Trailer: గుణశేఖ‌ర్ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్ రివ్యూ..
Euphoria Telugu movie trailer poster featuring intense character expressions and dramatic visuals
ఎంటర్‌టైన్‌మెంట్

Euphoria Trailer: గుణశేఖ‌ర్ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్.. సమాజానికి ఈ సినిమా అవసరం.. డోంట్ మిస్!

Euphoria Trailer: బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ (Gunasekhar) రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’ (Euphoria). శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ‌, యుక్తా గుణ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణశేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తెలియజేసింది. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నేటి సమాజానికి ఎంతో విలువైన పాయింట్‌ని ఇందులో చెప్పబోతున్నారనే విషయం తెలుస్తోంది. మరీ ముఖ్యంగా భూమిక పాత్రతో.. నేటి సమాజంలో తల్లిదండ్రుల పరిస్థితిని చెప్పిన తీరు నిజంగా వావ్ అనాల్సిందే. ట్రైలర్‌ని గమనిస్తే.. (Euphoria Trailer Review)

Also Read- Sharwanand: సంక్రాంతికి శర్వా వస్తే.. అన్ని సినిమాలు హిట్టే. వచ్చే సంక్రాంతికి కూడా రెడీ!

గుణశేఖర్‌కు హ్యాట్సాఫ్

‘అమ్మానాన్నలు మనతో పాటే కలల్ని కూడా కనేస్తుంటారు’ అంటూ సారా అర్జున్‌ డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. సివిల్ సర్వెంట్ అవ్వాలనే కల ఉన్న సారా అర్జున్.. ఫ్రెండ్ పిలిచిన పార్టీకి వెళ్లాలా? వద్దా? అనే డౌట్‌లో ఉన్నప్పుడు.. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అవడమంటే.. సొసైటీని స్టడీ చేయడం కూడా’ అని చెప్పే తండ్రి డైలాగ్‌లో ఫ్యామిలీ బాండింగ్‌ని పరిచయం చేశారు. కానీ, ఆ పార్టీనే కూతురి రాతను మార్చేస్తుందని ఏ తండ్రీ ఊహించడు కదా. అలా పార్టీకి వెళ్లిన సారా అర్జున్‌కు ఏమైంది? సివిల్స్ రాసిందా? లేదా? అనే క్యూరియాసిటీ ఒకవైపుని కలిగిస్తూనే.. మరోవైపు నేటి యువత పబ్‌లంటూ, తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో భూమిక కుమారుడి పాత్రతో చూపించారు. పబ్‌లో మత్తుమందులకు బానిసై, యూత్ ఎలా చెడిపోతున్నారనే విషయాన్ని సున్నితంగా టచ్ చేస్తూనే.. తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఎలా తమ పిల్లల్ని పెంచాలనే విషయాన్ని భూమిక పాత్రతో చెప్పిన తీరుకు.. నిజంగా గుణశేఖర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Also Read- Spirit Release Date: ప్రభాస్, సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

తల్లిదండ్రులకు మంచి మెసేజ్

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఎక్కడో విన్న కథలానే ఉంది. మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మన ఇంట్లోని పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వవచ్చు కానీ, అది ఎంత వరకు అనేది? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయంగా గుణశేఖర్ ఈ ‘యుఫోరియా’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేటి యూత్ డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎలా పెడదారులు పడుతుందనే విషయాన్ని చూపిస్తూనే.. తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలనే విషయాన్ని భూమిక పాత్రతో పరిచయం చేశారు. వాస్తవ ఘటనలో నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఎంత మందిని మారుస్తుందో తెలియదు కానీ, ఒక అలెర్ట్‌ని మాత్రం ఇస్తుందని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: వరంగల్‌లో ఒకలా? సికింద్రాబాద్‌లో మరోలా? బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి!

MSG Collections: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5 డేస్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్!

CM Revanth Reddy: తెలంగాణలో మరో బాసరగా.. ట్రిపుల్ ఐటీ కళాశాలకు శంఖుస్థాపన చేసిన సీఎం..!

Municipal Reservations: మునిసిపాలిటీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు.. ఆ కోణంలో రాజకీయ సెగలు పుట్టడం ఖాయం!

Vande Bharat Sleeper Train: పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్.. టికెట్ కొన్న ప్రతీ ఒక్కరూ వీఐపీనే!