Spirit Release Date: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్, వంగా కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘స్పిరిట్’ (Spirit)పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas).. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కలయికలో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా సృష్టించే రికార్డులను చూసేందుకు అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేసే వారందరికీ కోసం తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ప్రశ్న ‘స్పిరిట్ ఎప్పుడు వస్తుంది?’. దీనికి సమాధానంగా, మేకర్స్ 2027, మార్చి 5వ తేదీని (Spirit Release Date) లాక్ చేశారు. ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా, పాన్ వరల్డ్ స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. అంటే తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ప్రభాస్ తన సత్తా చాటబోతున్నారు.
Also Read- Tiger Of Martial Arts: పవన్ కళ్యాణ్, విద్యుత్ జమ్వాల్ మధ్య ఆసక్తికర సంభాషణ!
పవర్ ఫుల్ ఫస్ట్ లుక్..
కొత్త సంవత్సరం కానుకగా ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పింది. ఇందులో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పవర్ ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. సందీప్ వంగా మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్, ప్రభాస్ కటౌట్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఈ ఫస్ట్ లుక్‌తోనే ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారి నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇంటర్నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ తెరపై కొత్తగా ఉంటుందని టాక్. సందీప్ రెడ్డి వంగా ఆస్థాన సంగీత దర్శకుడు, ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి కూడా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. టి-సిరీస్ (భూషణ్ కుమార్), భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read- Kattalan: ‘కటాలన్’ సెకండ్ లుక్ వచ్చేసింది.. ఊర మాస్ అవతార్!
సందీప్ వంగా హ్యాట్రిక్ తర్వాత..
సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక రికార్డును క్రియేట్ చేశాయి. ఇప్పుడు ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని, ఇప్పుడు కాదు.. ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించిన రోజే అంతా ఫిక్సయ్యారు. ‘వస్తున్నాడు.. వేటాడబోతున్నాడు’ అన్న రేంజ్‌లో ఉన్న స్పిరిట్ అప్టేట్స్.. ఒక్కొక్కటి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇచ్చేస్తున్నాయి. 2027 మార్చి వరకు ఆగడం కష్టమే అయినా.. సందీప్ వంగా ఇచ్చే అవుట్ పుట్ కోసం వెయిటింగ్ వర్త్ అని చెప్పవచ్చు. గెట్ రెడీ ఫర్ ద స్పిరిట్ స్టోర్మ్..!
Spirit release date 🙂#Spirit pic.twitter.com/PyUrDoxw7d
— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 16, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

