Kattalan: ‘కటాలన్’ సెకండ్ లుక్ వచ్చేసింది.. ఊర మాస్ అవతార్‌!
Kattalan Second Look (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Kattalan: ‘కటాలన్’ సెకండ్ లుక్ వచ్చేసింది.. ఊర మాస్ అవతార్‌!

Kattalan: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టాలన్’ (Kattalan). సంక్రాంతిని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి సెకండ్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా, రెండవ లుక్‌ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఏనుగుల వేట నుంచి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్‌ను సూచిస్తూ, మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌‌ (Antony Varghese)ని ఈ పోస్టర్ పరిచయం చేస్తోంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌లోనూ, ఇప్పుడు వచ్చిన సెకండ్ లుక్‌లోనూ పవర్ ఫుల్‌గా చూపించారు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవడమే కాకుండా, ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.

Also Read- Vijay Deverakonda: అమ్మకు ప్రామిస్ చేశా.. నెక్ట్స్ సంక్రాంతికి పక్కాగా..!

రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా ‘కటాలన్’ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విడుదల తేదీని కూడా ప్రకటించారు. 2026, మే 14న (Kattalan Release Date) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమా రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఇంతకుముందు షరీఫ్ మహమ్మద్ నిర్మించిన పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి రాబోతున్న చిత్రమిది. మాస్ అప్పీల్, యాక్షన్ పరంగా ఈ సినిమా ‘మార్కో’ను అధిగమించేలా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పాటు, విడుదలైన పోస్టర్స్ కూడా తెలియజేస్తున్నాయి. ఈ మూవీ టీజర్‌ను జనవరి 16న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అవుతాయని చిత్రయూనిట్ చెబుతోంది.

Also Read- Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ ఫైట్స్..

ఇక ఈ సినిమా ఇప్పటికే మలయాళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓవర్సీస్ డీల్స్‌‌ను దక్కించుకుందని, షూటింగ్ పూర్తి కాకముందే ప్రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టిందని చిత్రబృందం హ్యాపీగా చెబుతోంది. ఫార్స్ ఫిల్మ్స్‌తో కలిసి, ఒక మలయాళ చిత్రానికి ఇప్పటివరకు ఎన్నడూ లేని అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్‌ను రెడీ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్-బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘పాంగ్’ అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీజీన్ వంటి వారు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. పాన్ ఇండియ భాషలలో రిలీజ్‌ కానున్న ఈ సినిమాకు ‘కాంతార, మహారాజ’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో సౌత్ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mahesh Incident: అక్కడ మహేష్ బాబును కూడా వదలని ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Spirit Release Date: ప్రభాస్, సందీప్ వంగా ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Netflix Telugu: ఈ ఏడాది ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదల కానున్న బిగ్ బడ్జెట్ చిత్రాలు ఇవే.. ఓ లుక్కేయండి

Tiger Of Martial Arts: పవన్ కళ్యాణ్, విద్యుత్ జమ్వాల్ మధ్య ఆసక్తికర సంభాషణ!

Municipal Elections: ఆ జిల్లాలో మున్సిపల్ పోరుకు కసరత్తు.. ఈ మూడు పార్టీల్లో పొత్తులపై ఇప్పుడిదే ఎడతెగని చర్చ!