Ashika Ranganath: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల సంగతేమోగానీ, హీరోయిన్ల హవా మాత్రం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు రష్మిక (Rashmika Mandanna), పూజా హెగ్డే (Pooja Hegde).. ఆ తర్వాత శ్రీలీల (Sreeleela).. ఇలా ఒక్కొక్కరు ఒక వెలుగు వెలిగారు. టాఫ్ ఛైర్‌ని సొంతం చేసుకున్నారు. కానీ వారి హవా ఇంతోకాలం నిలబడటం లేదు. పూజా హెగ్డే అవుటాఫ్ టాలీవుడ్ అయిపోయింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ వదిలి బాలీవుడ్‌పైనే ఫోకస్ చేస్తోంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలకే తను ఓకే చెబుతోంది. ఇక శ్రీలీల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె కూడా ప్రస్తుతం బాలీవుడ్‌లో తన లక్‌ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇక కొత్తగా వచ్చిన వారిలో మాత్రం.. ఇప్పుడు అందరి కళ్లు కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) మీద పడ్డాయి. కేవలం అందం మాత్రమే కాదు, ఆకట్టుకునే అభినయంతో ఈ అమ్మడు టాలీవుడ్ మేకర్స్‌ను, ఆడియన్స్‌ను తనవైపు తిప్పుకుంటోందనే చెప్పాలి.
Also Read- Sai Durgha Tej SYG: ఎద్దును పట్టుకుని.. ఊరమాస్ అవతార్‌లో తేజ్.. పోస్టర్ వైరల్!
‘అమిగోస్’ నుండి ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ వరకు..
ఆషికా రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రంతో జరిగింది. ఆ సినిమాలో తన గ్రేస్‌తో మెప్పించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ (bhartha mahasayulaku wignyapthi) చిత్రంతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ సరసన ఒక ఇంట్రెస్టింగ్ పాత్రలో ఆషికా మెరిసింది. ముఖ్యంగా ఒక పెళ్లైన మగాడికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఆమె పోషించిన పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతి రేసులో ఎన్నో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ, ఆషికా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమెలోని చార్మ్, ఫ్రెష్‌నెస్.. పక్కన డింపుల్ వంటి గ్లామర్‌ని బీభత్సంగా ఒలకబోసే భామ ఉన్నా కూడా.. ఆషికా సినిమాకు ఒక కొత్త ఎనర్జీని ఇచ్చిందంటే ఏ రేంజ్‌లో ఆమె విజృభించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫాలోయింగ్ భారీగా పెరిగిపోతోంది. యూత్‌లో ఆషికాకు వస్తున్న ఈ క్రేజ్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి ఆమె చేరడం ఖాయమనిపిస్తోంది.
Also Read- Nabha Natesh: అతిలోక సుందరిలా నభా.. ‘నాగబంధం’ ఫస్ట్ లుక్ చూశారా?
అది కూడా ఉంటేనా..?
ఆషికా నటనకు మంచి మార్కులే పడుతున్నప్పటికీ, కొందరు ప్రేక్షకులు ఆమె పర్ఫార్మెన్స్‌లో ఇంకాస్త డెప్త్ ఉండాలని కోరుకుంటున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో మరింత పరిణతి ప్రదర్శిస్తే, కేవలం గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా ఒక గొప్ప నటిగా కూడా గుర్తింపు తెచ్చుకోవచ్చని సినీ ప్రేమికులు సూచిస్తున్నారు. కానీ, సంక్రాంతి వచ్చిన సినిమాలో మాత్రం ఆమె గ్లామర్ ట్రీట్‌కు టికెట్లు తెగుతున్నాయంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. ప్రస్తుతం ఆషికా చేతిలో కొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’లో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు కోలీవుడ్ స్టార్ కార్తీ సరసన ‘సర్దార్ 2’ వంటి భారీ అంచనాలున్న చిత్రంలో కూడా నటిస్తోంది. మొత్తంగా చూస్తే.. నెక్ట్స్ సౌత్‌లో దుమ్మురేపే హీరోయిన్‌గా ఆషికా మారుతుందనడంలో సందేహమే లేదు. చూద్దాం.. మరి తన లక్‌ని ఆమె ఎలా వినియోగించుకుంటుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

