Nabha Natesh: అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథలాజికల్ అడ్వెంచర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). ‘పెద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, సంక్రాంతి పండగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్న నభా నటేష్ లుక్‌ను ‘పార్వతి’ (Parvathi) పాత్రలో రివీల్ చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (JVAS) సినిమాలో శ్రీదేవి (Sridevi) గుర్తొస్తోంది. సేమ్ టు సేమ్ దేవకన్యలా ఇందులో నభా కనిపిస్తుంది. ఈ లుక్‌ని గమనిస్తే..
Also Read- Mega Interview: మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వచ్చేసింది..
అతిలోకసుందరిలా నభా..
ఈ పోస్టర్‌లో నభా నటేష్ (Nabha Natesh) అచ్చం ఒక దేవకన్యలా కనిపిస్తోంది. రెడ్, గ్రీన్ కలర్స్ మేళవింపుతో ఉన్న పట్టుచీర, నిండుగా ఉన్న బంగారు ఆభరణాలు, నుదుటన తిలకంతో ఆమె రూపం దివ్య స్వరూపంలా కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ముఖ్యంగా ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ గాంభీర్యం, కోమలత్వం ఈ పాత్ర వెనుక ఏదో పెద్ద రహస్యమే దాగి ఉందని సూచిస్తున్నాయి. ఆమె చేతికి దగ్గరగా ఎగురుతున్న ఆ నీలిరంగు పాలపిట్ట, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న పురాతన ఆలయం, నెమలి.. ఇవన్నీ పోస్టర్‌కు ఒక ఆధ్యాత్మిక, క్లాసిక్ లుక్‌ని తీసుకొచ్చాయనడంలో అసలు అతిశయోక్తి లేనే లేదు. చూడగానే డివైన్ వైబ్రేషన్ వచ్చేస్తోంది. ఈ లుక్‌లో నభా చాలా కొత్తగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె హాట్ హాట్ ఫొటోషూట్స్ చూసిన వారందరికీ, ఈ లుక్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
Also Read- The Raja Saab: ముగ్గురు భామలతో రాజా సాబ్.. పోస్టర్ అదిరిపోలా..!
సమ్మర్ బరిలో..
కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐశ్వర్య మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ ఒక లెక్క, ఇప్పుడొచ్చిన నభా పోస్టర్ మరో లెక్క అన్నట్లుగా ‘నాగబంధం’ సినిమాపై ఈ పోస్టర్ భారీగా అంచనాలను పెంచేసింది. ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్‌ని ఈ సినిమా ఇవ్వబోతుందనే ఫీల్‌ని ఈ పోస్టర్ ఇచ్చేసింది. సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుందని, శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ.. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో వుంటుందని ఆల్రెడీ మేకర్స్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్న నభా నటేష్.. ఈ సినిమాతో తన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చూద్దాం.. మరి, ఈ సమ్మర్‌లో థియేటర్లలో ‘నాగబంధం’ సృష్టించబోయే అడ్వెంచర్ ట్రీట్ ఎలా ఉండబోతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

