Amit Shah (imagcredit:swetcha)
తెలంగాణ

Amit Shah: మోదీ చెప్పిందే చేసి చూపించారు.. అమిత్ షా

Amit Shah: నక్సలిజాన్ని 2026 లోపు అంతం చేస్తామని, మోడీ(Modi) చెప్పిందే చేసి తీరుతాడనీ, పాకిస్థాన్‌(Pakisthan)కు ముడు సార్లు తడాఖా చూపించిన ఘనత భారత్ ప్రభుత్వానిదే నని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్(Dharmapuri Srinivas) విగ్రహాన్ని ఆవిష్కరించి, పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటుచేసిన కిసాన్(Kisan) బహిరంగ సభలో రైతుల ఉద్దేశించి మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఇందూరులో జాతీయ పసుపు పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. బిజెపి మాట ఇచ్చిందంటే ఆ మాటకు కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2026 లోపు నక్సలిజం అంతం

కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పసుపు బోర్డు సాధించిన ఘనత ఎంపీ అరవింద్(MP Aravind) కే దక్కుతుందన్నారు. పసుపు బోర్డు చైర్మన్‌ని కూడా నిజామాబాద్‌(Nizamabad)కు చెందిన రైతు బిడ్డను ఎంపిక చేయడం జిల్లాకు దక్కిన గౌరవం అన్నారు. నిజామాబాద్ పసుపుకు రాజధానిగా నిజామాబాద్(Nizamabad) నిలుస్తుందన్నారు. ఇప్పటికింకా రాహుల్(Rahul) బాబా ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారని, ఆపరేషన్‌ కగార్(Operation Kagar) చేయాలా వద్దా అని ప్రశ్నించారు. లొంగిపోవాలని హెచ్చరించిన లొంగక పోవడంతో అందుకే కగార్ చేపట్టామని అన్నారు. 2026 లోపు నక్సలిజం అంతం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revath Reddy) బీఆర్ఎస్(BRS) సర్కారు ఎలాంటి అవినీతికి పాల్పడిందో ప్రజలందరికీ తెలిసిందేనని, కాలేశ్వరం(Kaleshwaram)తో ప్రజా ధనాన్ని లూటీ చేయడమే కాకుండా టీఎస్‌పిఎస్‌సి(TSPSC) లాంటి వాటితో అవినీతికి పాల్పడిందని అన్నారు.

Also Read: Raghunandan on Kavitha: నన్నెందుకు విచారణకు పిలవడం లేదు.. ఎంపీ రఘునందన్ రావు

కాంగ్రెస్‌కు కూడా నూకలు చెల్లిపోయాయి

కాలేశ్వరం బీఆర్ఎస్‌(BRS)కు ఏటీఎం(ATM) అయితే, ఇప్పటి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఢిల్లీ(Delhi)కి ఏటీఎంలా తయారయిందన్నారు. తెలంగాణ(Telangana) ప్రజలు బీఅర్ఎస్(BRS) జెండాను ఎప్పుడో పీకి పరేశారని, ఇక్కడి కాంగ్రెస్‌కు కూడా నూకలు చెల్లిపోయాయన్నారు. పసుపు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా పసుపు రైతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని గుర్తు చేశారు. మోడీ చెప్పిందే చేసి తీరుతాడని, ఎన్నో ఏళ్ల నాటి పసుపు బోర్డు కలను నిజం చేయడం జరిగిందన్నారు. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన విగ్రహం నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు.

Also Read: Israel USA: వామ్మో.. ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎంత ఖర్చుపెట్టిందో బయటపడింది

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు