Raghunandan on Kavitha (imagcredit:twitter)
తెలంగాణ

Raghunandan on Kavitha: నన్నెందుకు విచారణకు పిలవడం లేదు.. ఎంపీ రఘునందన్ రావు

Raghunandan on Kavitha: అసలు కవిత ఎవరని, ఆమెకు బీసీ(BC) ఉద్యమానికి సంబంధమేంటని, ఆమె బీసీనా అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Ragunadan Rao) ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్లు అధికారంలో ఉన్న కవితకు(MLC Kvitha) బీసీలు ఎందుకు గుర్తుకురాలేదని ఆయన ప్రశ్నించారు. అధ్యక్ష పదవి, ఎల్పీ పదవులు ఇవ్వకుండా బీసీ ఉద్యమం చేస్తామంటే ఎలా అని నిలదీశారు. కవిత బోధించడం కాకుండా ఆచరణపై దృష్టిపెట్టాలని రఘునందన్ రావు సూచించారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తే రాజ్యంగా సవరణ చేస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా అన్నపూర్ణ క్యాంటీన్లకు పేరు మార్చి ఇందిరాగాంధీ(Indira Gandhi) పేరు పెట్టడం దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

పిల్లల శరీరాలు కుక్కలకు ఆహారం

ఎమర్జెన్సీతో చీకటి రోజులు తెచ్చిన ఇందిరాగాంధీ పేరు అన్నపూర్ణ క్యాంటీన్ల(Annapurna Canteen) కు పెట్టడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. నగరంలో పిల్లల శరీరాలు కుక్కల(Dogs)కు ఆహారంగా మారుతున్నాయని, మేయర్ వాటిపై దృష్టిపెట్టాలని సూచించారు. తెలంగాణ(Telangana )లో ఏ ఊరికి రమ్మన్నా వస్తానని, ఎక్కడైనా ఒక్క ఇందిరమ్మ ఇల్లయినా వచ్చిందా? చూపించాలని కాంగ్రెస్(Congress) ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సవాల్ రఘునందన్ రావు విసిరారు. ఇకపోతే దుబ్బాక ఉప ఎన్నికలతో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) మొదలైందని, ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఎంపీ ఫైరయ్యారు. విచారణ పేరుతో టైంపాస్ చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ముఖ్యమంత్రికి ఇంకెన్ని రోజులు కావాలని ఎంపీ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ గాంధీభవన్ పంచాయితీలా మారిందని ఎద్దేవాచేశారు.

Also Read: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ఏం చదివారు?, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా?

రఘుంధన్ రావును పిలిచే ధైర్యం సిట్‌కు లేదా

కాంగ్రెస్(Congrss), బీఆర్ఎస్(BRS) ములాఖాత్ అయ్యాయనేందుకు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ విచారణలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సిట్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రభాకర్ రావు(Prabhakar Rao)ను అరెస్ట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో రఘుంధన్ రావును పిలిచే ధైర్యం సిట్ కు లేదా అని రఘునందన్ రావు ప్రశ్నలవర్షం కురిపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని అనేక సార్లు తాను చెప్పానని, ఫోన్ ట్యాపింగ్ లో మొదటి భాద్యుడిని తానేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిందే తానని, కానీ తననే విచారణకు పిలవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. విచారణ అంటే ఎపిసోడ్లుగా జరిగే సీరియలా? అని ఎంపీ ప్రశ్నించారు. అది విచారణా? లేక సీరియలా అని చురకలంటించారు. సిట్ విచారణలో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండబోవన్నారు. ఈ అంశంపై సిట్ కే కాదని, రాష్ట్ర వ్రభుత్వానికి సైతం చిత్తశుద్ధి లేదన్నారు.

Also Read: Youtube New Rules: రూల్స్ మార్చిన యూట్యూబ్… ఇకపై వారికి కుదరదు

 

 

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?