Meenakshi Natarajan: వరంగల్ (Warangal)జిల్లా ఎపిసోడ్ పై ఏఐసీసీ(AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ఫైర్ అయ్యారు. నేతల మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలు పార్టీలో చెల్లవంటూ నొక్కి చెప్పారు. ఇలాంటి పరిస్థితులను తాను సహించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఏ స్థాయి నేతకైన ఒకే రూల్ ఉంటుందని ఆమె హెచ్చరించారు. కొండా మురళి(Min Konda Sureka) వ్యాఖ్యలు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయని, దీనిపై ఇతర జిల్లా నేతలతో ఎంక్వైయిరీ చేపిస్తామని ఏఐసీసీ ఇన్ చార్జ్(AICC Meenakshi Natarajan) ప్రకటించారు.
కొండా ఫ్యామిలీతో తంటా
ఇక ఇటీవల కొండా మురళీ(Konda Murali) చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాకు చెందిన కొందరు ఎమ్మె ల్యే లు పార్టీకి ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఆయన భర్త మురళీ అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదంటూ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి(Kadiyam Srihari), గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి స్వర్ణలు నేరుగా ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో వర్గపోరులు సృష్టిస్తున్న కొండా ఫ్యామిలీ కావాలా? తాము కావాలా? అనేది స్పష్టం చేయాలని ఆయా నేతలు ఏఐసీసీ ఇన్ చార్జ్ ముందు వాపోయినట్లు తెలిసింది. కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.
Also Read: MP Kishan Reddy: జాయినింగ్స్ పై కమలం ఫోకస్.. చేరికలు చేపట్టాలని పిలుపు
మీనాక్షి నటరాజన్‌తో ఎంపీ మల్లు రవి భేటీ
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) భేటీ అయ్యారు. ఈనెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు గాంధీ భవన్(Gandhi Bhavan) లో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్టు ఆయన తెలిపారు .ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు నియోజక వర్గాలలో నాయకులు క్రమశిక్షణ అంశాలకు సంబంధించిన పలు ఫిర్యాదులపై విధివిధానాలను చర్చించారు. ఈ మీటింగ్ లోనే కొండా వివాదాలకు చెక్ పెట్టాలని ఏఐసీసీ(AICC) ఇన్ చార్జీ భావిస్తున్నట్లు తెలిసింది.
Alsom Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం