SAR Data Crop: పంటల వివరాల నమోదులో సింథటిక్ అపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) డేటా వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ( Professor Jayashankar Agricultural University) అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు(Tummala Nageswara Rao )అందజేశారు. రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలను అంచనా వేసేందుకు విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయడం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుందని అన్నారు.
Also Read: GHMC Street Lights: స్ట్రీట్ లైట్లకు మెరుగైన నిర్వహణ…ఆరు జోన్లకు 12 వేల వీధి లైట్లు!
ప్రణాళికలు సిద్ధం చేయాలి
వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ముందస్తు అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వసతులను ఉపయోగించి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల వరకు రాష్ట్రంలో పంటల వారీగా సాగవుతున్న విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాటి అమలుకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల బీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలని విశ్వవిద్యాలయ అధికారులను మంత్రి ఆదేశించారు.
యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సింథటిక్ అపర్చర్ డేటా ఆధారంగా స్విట్జర్లాండ్ సంస్థ భాగస్వామ్యంతో కలిసి చేసిన ప్రయోగాలను, ఆ సాంకేతికత ఆధారంగా వానాకాలంలో పంటల నమోదులో వివిధ రాష్ట్రాలలో సాధించిన ఖచ్చితత్వాన్ని మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డాక్టర్ సమీరేండు మోహంతి, శాస్త్రవేత్త డా. టీఎల్ నీలిమ, పరిశోధన సంచాలకుడు డా. ఎం. బలరాం, డిజిటల్ అగ్రికల్చర్ సెంటర్ డైరెక్టర్ డా. బీ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Tollywood: ఒకే సారి 15 చిత్రాలు నిర్మాణం.. నిర్మాత ఎవరంటే?