Tollywood: మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ వాడిగా ఘనత సాధించారు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. భీమవరం టాకీస్ బేనర్ పై 100 కుపైగా సినిమాలు నిర్మించి చరిత్రకెక్కారు. ఇప్పటివరకూ నిర్మాత డి రమానాయుడుపై ఉన్న ఈ రికార్డును తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అధిగమించారు. తాజాగా సినిమా నిర్మాణ రంగంలో మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే సారి 15 చిత్రాలు నిర్మించడానికి వేదిక సిద్ధం చేసుకున్నారు. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైద్రాబాద్ లోని సారధి స్టూడియో వేదిక కానుంది.
Read Also- Shivabala Krishna: శివబాలకృష్ణకు ఈడీ అధికారులు ఝలక్
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ రామ్ గోపాల్ వర్మతో బాగా సాన్నిహిత్యం కలిగి ఆయనతో ‘ఐస్ క్రీమ్ 1’, ‘ఐస్ క్రీమ్ 2’ లాంటి సినిమాలు నిర్మించారు. ఈయన దాదాపు 100 కి పైగా చిన్న చిత్రాలు నిర్మించారు. వాటిని సమర్థవంతంగా తీసి పూర్తిచేశారు. ఐస్ క్రీమ్ సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన భయానక థ్రిల్లర్. ఇందులో నవదీప్, టేజస్వి మడివాడ ప్రధాన పాత్రల్లో నటించారు. కథలో రెనూ అనే అమ్మాయి కొత్తగా ఓ బంగ్లాలోకి మారుతుంది. అక్కడ ఆమెకి అర్థం కాని భయాలు, కలలు మొదలవుతాయి. తన బాయ్‌ఫ్రెండ్ విశాల్‌కి చెప్పి ఆ ఇంట్లో కలిసి గడుపుతారు. ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొనే అనుభవాలే సినిమా హైలైట్. ఈ సినిమాలో ఫ్లో క్యామ్ అనే కొత్త కెమెరా టెక్నాలజీ వినియోగించారు, ఇది ఇండియన్ సినిమాలో తొలిసారి ప్రయోగించారు. సినిమా తక్కువ బడ్జెట్‌తో తీసినా మంచి ప్రచారం లభించింది.
Read Also- Vishwambhara: చిరుతో జతకట్టిన బాలీవుడ్ బ్యూటీ.. విశ్వంభర సెట్‌లో రచ్చ రంభోలా!
రామ్ గోపాల్ వర్మ ఒక ప్రయోగాత్మక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. 1989లో ‘శివ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, ‘సత్య’, ‘రంగీలా’, ‘కంపెనీ’ వంటి హిట్ సినిమాలతో తనదైన శైలిని ఏర్పరచుకున్నాడు. నూతన టెక్నాలజీలు, విభిన్నమైన కథనాలపై ఆసక్తి ఉండే వర్మ, ’ఐస్ క్రీం’, ‘వ్యూహం’, ‘సారీ’ లాంటి చిత్రాలతో తరచూ చర్చనీయాంశంగా నిలుస్తూ ఉంటాడు. విమర్శలకో సానుభూతికో కాదు అనే ధోరణితో, తన సినిమాలను తన స్టైల్లోనే తీస్తూ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దర్శకుడిగా గుర్తింపు పొందారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.