Damodar Rajanarsimha: రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha) స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా అందరికీ అందుబాటులో, తక్కువ ఖర్చుతో కూడిన, సమానమైన వైద్యం అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘హెల్త్ విజన్-2047’ ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రతతో కూడిన వైద్యాన్ని అందిస్తామని వెల్లడించారు. ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల విధానాన్ని బలోపేతం చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5,023 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రాథమిక సేవలు, 184 టీవీవీపీ ఆసుపత్రుల ద్వారా స్పెషలైజ్డ్ సేవలు అందిస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 35 బోధనాసుపత్రులు, 13 స్పెషాలిటీ ఆసుపత్రులతో తృతీయ స్థాయి వైద్యాన్ని పటిష్టం చేశామన్నారు.
నగరానికి నలువైపులా టిమ్స్
వైద్య మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోందన్నారు. 2 వేల పడకలతో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, రూ.1698 కోట్లతో నిమ్స్ విస్తరణ, వరంగల్ హెల్త్ సిటీ (1750 పడకలు), హైదరాబాద్ నలువైపులా మూడు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించారు. పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో అఫర్డబిలిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, ఇందులో రోబోటిక్ సర్జరీ(Robotic surgeries,)లు, అవయవ మార్పిడి(organ transplants) వంటి ఖరీదైన చికిత్సలను కూడా చేర్చామని గుర్తు చేశారు. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, దాదాపు 100 శాతం ప్రసవాలు హాస్పిటల్స్‌లోనే జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. క్యాన్సర్ బాధితుల కోసం ప్రతి జిల్లాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉచితంగా కీమోథెరపీ అందిస్తున్నామన్నారు. మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని, ఏటా లక్ష మంది విదేశీయులు నగరంలోని హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. మెడికల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించామని, ఇక్కడికి వచ్చే పేషెంట్లకు దోపిడీ జరగకుండా కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Also Read; Suicide Crime: దారుణం.. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమో అన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య
ప్రపంచ విద్యా కేంద్రంగా..
తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో వైద్య, విద్యా రంగాలే వెన్నెముకగా నిలుస్తాయని అన్నారు. కేవలం పుస్తక జ్ఞానం కాకుండా, నైపుణ్యాభివృద్ధి, ఎంటప్రిన్యూర్ షిప్ మిళితమైన నాణ్యమైన విద్యను అందరికీ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రభుత్వం బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలను ప్రారంభించిందన్నారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ, అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను మెరుగుపరచడానికి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కోసం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలియజేశారు. రాష్ట్రం ప్రస్తుతం కళాశాల సాంద్రతలో దేశంలో రెండో స్థానంలో ఉందని, గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియోలో టాప్-5లో నిలిచిందని మంత్రి వెల్లడించారు. 2047 నాటికి ప్రతి పౌరుడిని నైపుణ్యవంతుడిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొ
Also Read: Bigg Boss9 Telugu: అలా చెప్పడంతో ఇమ్మానుయేల్‌పై ఫైర్ అయిన భరణి.. ఈ క్లాష్ ఏంది భయ్యా..

