Adi Srinivas (imagecredit:twitter)
తెలంగాణ

Adi Srinivas: ఈటెలకు మతిపోయింది.. పిచ్చివాగుడు కట్టిపెట్టాలి.. ప్రభుత్వ విప్ ఫైర్!

Adi Srinivas: ఈటెల రాజేందర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈటెల మర్యాదస్తుడు అనుకున్నాం కానీ ఆయనకు మతి తప్పిందని అన్నారు. పదవులు, రాజకీయా కోసం ఆయన దిగజారి పోయి మాట్లాడుతున్నాడని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే మీ అధిష్టానాన్ని కాక పట్టుకో కానీ మా ముఖ్యమంత్రిని బూతులు తిడితే పదవి వస్తుందనుకోవడం నీ అవివేకానికి నిదర్శంమని ఆది శ్రీనివాస్ అన్నారు.

ప్రభుత్వ చెరువులను హైడ్రా రక్షణ

ఇంత కాలం రాజకీయాల్లో ఉండి చివరకు ఈ స్థితికి వస్తావని మేం అనుకోలేదు. ఈటెల రాజేందర్ ముందు నీ పిచ్చి వాగుడు కట్టి పెట్టు ఈ పిచ్చి ప్రేలాపనలు ఆపుమని ఎద్దేవ వేశాడు. నువ్వు శాడిస్ట్, సైకో అని మాట్లాడావు మాకు అంతకు మించిన మాటలు కూడా వచ్చు అది గుర్తు పెట్టుకోమని హెచ్చరించారు. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి నా కొడకా అన్న పదాలు వాడుతున్నవంటే నీ మానసిక స్థితి అర్థమవుతూనే ఉంది. హైదరాబాద్‌లో ఆక్రమణ గురైన ప్రభుత్వ స్థలాలు, చెరువులను హైడ్రా రక్షిస్తోంది.

Also Read: Operation Sindoor: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. ప్రధాన నగరాలన్నీ ఖతం!

ఇప్పటికే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా దారుల నుంచి విముక్తి చేసిందని అన్నారు. మా ప్రభుత్వం ఉన్నది పేదలు, సామాన్యుల కోసమే వాళ్ల ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగించం, పేదల ఇళ్లను అన్యాయంగా మా ప్రభుత్వం ఎందుకు కూల్చుతుందని అన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అలా కాకుండా శాపనార్థాలు పెడితే ఏమోస్తుంది. ప్రభుత్వాధికారులను దూషిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటం ఆపు, నీ నీచ రాజకీయం కోసం మా ముఖ్యమంత్రి పైన దిగజారుడు భాష ఉపయోగిస్తే మాత్రం సహించేది లేదంటూ చురకలు చూపించారు.

బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక మంత్రి

మీరు నీచ భాష ఆపకపోతే మేం అంతకు మించి భాషను వాడాల్సి వస్తోందని, ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు. అప్పుల కుప్ప మారిన రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే బీఆర్ఎస్ పాలన లో ఆర్థిక మంత్రిగా ఉండి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు విని బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది నువ్వు కాదా అని ఆది శ్రీనివాస్ అన్నారు.

Also Read: CPI Narayana: యుద్ధం పాకిస్తాన్ టెర్రరిజంపైనే.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు!

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!