College Bus Accident: తెలంగాణలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భద్రాచలం సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు.. అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక ప్రజలు, వాహనదారులు.. బస్సులోని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మణుగూరు నుంచి పాల్పంచలోని కాలేజీకి బస్సు వెళ్తుండగా మెుండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో ప్రమాదానికి గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాద అనంతరం పెద్ద ఎత్తున విద్యార్థుల హాహాకారాలు వినిపించాయి. దీంతో స్థానికులు బస్సు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. రక్తంతో తడిచిన బట్టలతో ఉన్న విద్యార్థులను చూసి స్థానికులు సైతం తీవ్ర కలవరానికి లోనయ్యారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Also Read: Telangana Assembly: శాసనసభలో గందరగోళం.. యూరియాపై బీఆర్ఎస్ నిరసన.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బస్సు బోల్తా పడిన ఘటనలో ఎలాంటి మరణం చోటుచేసుకోకపోవడంతో పోలీసులతో పాటు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులకు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బస్సు ఫిట్ నెస్ గురించి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాద ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేటు కాలేజీ బస్సు బోల్తా.. 60 మంది విద్యార్థులకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం
మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడిన స్కూల్ బస్సు
బస్సు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీసి ఆసుపత్రికి… pic.twitter.com/FhJfgqeiVK
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026

