Newborn Dies: యాదాద్రి భువనగిరి జిల్లాలో నవజాత శిశువు మృతి
యాదాద్రి భువనగిరి, స్వేచ్ఛ: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలోని శ్రీ లింగ భశ్వేశ్వర ఆలయంలో ఒక శిశువును వదిలివేసిన విషయం తెలిసిందే. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ శిశువు చనిపోయింది. బుధవారం అర్ధరాత్రి మృతి (Newborn Dies) చెందినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావు గురువారం తెలిపారు. పాప హాట్ బీట్ తగ్గడం, చలిలో వదిలివేసిన కారణంగా శిశువు శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని నర్సింహారావు వెల్లడించారు.
Read Also- Illegal Medical Shops: ఎవరైనా దీనిని తనిఖీ అంటారా?.. చెకింగ్‌కు వెళ్లి అధికారులు చేస్తున్న పనిది
పాపను వదిలివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
వదిలేసినవారిని గుర్తించి శిక్షించాలి: బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్
పడమటి సోమారం గ్రామంలోని శ్రీ లింగ భశ్వేశ్వర ఆలయంలో బుధవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన పాపను వదిలివేసిన వారిని పోలీసులు వెంటనే గుర్తించాలని, వారిపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్, మరియు అధికారులు చూడాలని ఆయన కోరారు.
Read Also- Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?

