Aarogyasri Scam (imagecredit:twitter)
తెలంగాణ

Aarogyasri Scam: రాఫ్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు గేమ్.. ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం!

Aarogyasri Scam: ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్ మెంట్ లో కుట్ర జరుగుతున్నట్లు సర్కార్ అంతర్గత పరిశీలనలో తేలింది. ఆరోగ్య శ్రీ లో కొత్త దవాఖాన్లు చేరకుండా గతంలో ఎం ప్యానెల్ చేసుకున్న కొన్ని దవాఖాన్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఓక టీమ్ గా ఏర్పడి, ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త ఆసుపత్రులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం కొత్త ఎంప్యానెల్స్ ఇవ్వొద్దని ఈ టీమ్.. ప్రభుత్వ పెద్దలకు కూడా వివరించినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం నుంచి పాజిటివ్ సంకేతాలు రాకపోవడంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల(Private Hospitals) యాజమాన్యాలు కొత్త పంథాలో ఎంప్యానల్స్ కు అడ్డుపడుతున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రావడం లేదని, పేషెంట్ల తాకిడి లేదని, ట్రీట్మెంట్ ప్రోసీజర్ల ధరలు సరిగ్గా లేవని, బిల్లులు కోసం ఏళ్ల తరబడి నుంచి తిరగాల్సి ఉంటుందని తదితర కారణాలను ప్రచారం చేస్తూ కొత్త దవాఖాన్లు ముందుకు రాకుండా అడ్డుకుంటున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో గుర్తించారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. పేషెంట్ల కోణంలోనే తమ నిర్ణయాలు ఉంటాయని, వైద్యం విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ లతో ఎట్టి పరిస్థిత్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని ప్రభుత్వం నొక్కి చెప్తున్నది.

1780 కోట్లు రిలీజ్..450 కోట్లు పెండింగ్…?

వాస్తవానికి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు రూ. 1780 కోట్లను రిలీజ్ చేసినట్లు ఆరోగ్య శ్రీ బోర్డు అధికారులుచెప్తున్నారు. ప్రస్తుతానికి కేవలం సుమారు రూ. 450 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, కానీ కొన్ని నెట్ వర్క్ ఆసుపత్రులు ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పైగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఈ స్థాయిలో నిధులు పెండింగ్ లేవని అధికారులు కొట్టి పరేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక ఏకంగా కొత్తగా వందకు పైగా ఆసుపత్రులు ఎంప్యానెల్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం 461 ప్రైవేట్(Private), కార్పొరేట్(Carporate) ఆసుపత్రులు ఆరోగ్య శ్రీలో సేవలు అందిస్తున్నాయి.

ఇప్పటికీ ఎంప్యానెల్ కు భారీగా దరఖాస్తులు పెరగడంతో ఓ టీమ్ నెగెటివ్ ప్రచారానికి ఒడిగట్టిందని ప్రభుత్వం గుర్తించింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఓ ఫాలసీని తీసుకువచ్చింది. యాక్సిడెంట్ కేసుల్లో లక్షన్నర వరకు పేషెంట్లకు ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే చొరవ తీసుకొని వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో వీలైనన్నీ ఆసుపత్రులకు ఎంప్యానెల్ ఇచ్చి, ఈ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీని వలన ట్రామా కేర్ క్లినిక్(Trauma Care Clinic) లలోనూ పేద పేషెంట్లకు వేగంగా వైద్యం అందించవచ్చిన ప్రభుత్వం ఆలోచన. ఈ నిర్ణయానికి కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లోని కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తప్పుడు ప్రచారాన్ని తెరమీదకు తీసుకువచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.

Also Read: BJP Ramchandra Rao: కాంగ్రెస్ అబద్దపు పాలన.. సర్కార్‌పై రామచందర్ రావు ఫైర్

కాంగ్రెస్ వచ్చాక కీలక నిర్ణయాలు..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీంతో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ దాదాపు 11 లక్షల మంది వరకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు పాత చికిత్స ధరలను సవరిస్తూ ఏకంగా 22 శాతం చార్జీలు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ దవాఖాన్లన్నీ ఎంప్యానెల్ కు ముందుకు వస్తున్నట్లు బోర్డు అధికారులు చెప్తున్నారు. గతంలో ఆరోగ్య శ్రీ అంటే రిజెక్షన్స్ ఉండేవని, కానీ ఇప్పుడు పక్కా అడ్మిషన్లే అంటూ ఓ అధికారి వెల్లడించారు.

ఇక ఆరోగ్య శ్రీ స్కీమ్ కొరకు 2014 నుంచి 2023 వరకు బీఆర్ ఎస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే, 2023 డిసెంబర్‌‌ నుంచి 2024 డిసెంబర్ వరకు నెలకు సగటున రూ.76 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నా..గత ప్రభుత్వం గడిచిన పదేళ్ల నుంచి పెండింగ్ లో పెడుతూ వచ్చిన రూ.730 కోట్ల బకాయిలు ఉండటం వలన నెట్ వర్క్ ఆసుపత్రులకు పేమెంట్లు ఇబ్బందిగా మారాయి. ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఏటా సగటున వెయ్యి కోట్లకు చొప్పున నిధులు వెచ్చించాల్సి ఉండగా, బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు 50 శాతం చొప్పున కేటాయించింది.  2015 లో రూ 444 కోట్లు, 2016 లో రూ. 609 కోట్లు, 2017 లో రూ. 524 కోట్లు, 2018 లో రూ. 596 కోట్లు, 2020 లో రూ. 557 కోట్లు, 2021 లో రూ, 783 కోట్లు, 2022 లో రూ.631 కోట్లు, 2023 లో రూ. 515 కోట్లు చెల్లించగా, కాంగ్రెస్ ప్రభుత్వం 2024 లో రూ. 1130 కోట్లను రిలీజ్ చేసింది.పాత బకాయిలు పేరుకుపోవడంతో నెట్ వర్క్ ఆసుపత్రులకు ఇప్పటికీ డ్యూస్ కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు.

Also Read: Kantara Chapter 1: ‘కాంతార చాప్తర్ 1’ థియేట్రికల్ హక్కులు ఎంతో తెలిస్తే షాక్..!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు