BJP Ramchandra Rao: రాష్ట్రంలో కాంగ్రెస్ అబద్దాల పాలనా చేస్తోందని, రాహుల్ గాంధీ నోటికి ఏదొస్తే అది అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(BJP Ramchandra Rao) మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు జరగాలన్నారు. ‘పల్లె పల్లెకు బీజేపీ(BJP) అనే కార్యక్రమాన్ని రాంచందర్ చేవెళ్ల కేంద్రంగా ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస్ కళ్యాణ మండపంలో యువ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరి రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావాలన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమం అవసరమైతే యువత ముందు ఉండాలన్నారు.
Also Read: Gold Rate Dropped: సామాన్యులకు ఎగిరి గంతేసే న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
యువత కొత్త వెలుగు కోసం
చేవెళ్ల ప్రాంతంలో కొంత కాలంగా కుటుంబ పాలనా నడుస్తోంది. మేము చెప్పిందే చేవెళ్లలో నడవాలి అన్నట్టు ఇక్కడ రాజకీయం ఉంటుంది. తెలంగాణలో యువతను మభ్యపెట్టి పాలనా చేస్తున్నారు. స్థానిక ఎన్నికలో మార్పు చేవెళ్ల నుంచే మొదలు కావాలి. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలిచి జిల్లా జడ్పీ చైర్మపర్సన్ గెలవాలి. రాష్ట్రంలో ములో యువత కొత్త వెలుగు కోసం చూస్తోంది. అ వెలుగే బీజేపీయే కావాలి’ అని రాంచందర్ వెల్లడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో యువత పార్టీలో చేరారు.
Also Read: TVK Vijay: ఎన్నికల్లో పొత్తుపై టీవీకే అధినేత, హీరో విజయ్ కీలక ప్రకటన