Whats App: ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ WhatsApp ఇప్పుడు స్టేటస్ ఫీచర్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా WhatsApp స్టేటస్ ఎడిటర్‌లోనే Meta AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్స్ ను పరీక్షిస్తోంది. ఇకపై ఫోటోలను ఎడిట్ చేయడానికి వేరే యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా, నేరుగా WhatsApp లోపలే చేయవచ్చని కంపెనీ సూచిస్తోంది.
ఈ కొత్త ఫీచర్ మొదట Android బీటా వెర్షన్లో ప్రారంభమై, ఇప్పుడు iOS బీటా వినియోగదారులకు TestFlight కూడా అందుబాటులోకి వస్తోంది. కొందరు iOS బీటా యూజర్లు ఫోటో స్టేటస్ అప్డేట్ చేస్తున్నప్పుడు పూర్తిగా కొత్త ఎడిటింగ్ స్క్రీన్‌ను చూస్తున్నారు. ఇందులో సాధారణ ఫిల్టర్లతో పాటు, Meta AI శక్తితో పనిచేసే కొత్త ఎడిటింగ్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
Also Read: Accreditation Guidelines: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై మీడియా అకాడమీ చైర్మన్ స్పందన
ఈ AI టూల్స్ నుంచి ఫోటోలను Anime, Comic Book, Clay, Painting, 3D, Kawaii, Video Game వంటి విభిన్న స్టైల్‌లలోకి మార్చుకోవచ్చు. ఇవి సాధారణ స్టిక్కర్లు లేదా ఓవర్లేలు కాకుండా, AI మీ ఫోటోను పూర్తిగా ఆ స్టైల్‌లో తిరిగి రూపొందిస్తుంది. ఫలితం నచ్చకపోతే ‘Redo’ ఆప్షన్ ద్వారా అదే స్టైల్‌లో మరో వెర్షన్‌ను తిరిగి జనరేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఇంతటితో ఆగకుండా Meta AI లో ఫోటోలో అవసరం లేని వస్తువులను తొలగించడం, కొత్త ఎలిమెంట్లను జోడించడం, సీన్‌ను మార్చడం వంటి పనులు కూడా చేయవచ్చు. అంతేకాదు, స్టాటిక్ ఫోటోలను చిన్న యానిమేటెడ్ విజువల్స్‌గా మార్చే సామర్థ్యాన్ని కూడా ఈ టూల్స్ అందిస్తున్నాయి. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ సహజంగా కనిపించేలా కనెక్టివిటీని AI జాగ్రత్తగా కాపాడుతుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ iOSలో TestFlight నుంచి ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు మాత్రమే క్రమంగా అందుబాటులోకి వస్తోంది. కొందరు సాధారణ App Store వెర్షన్ యూజర్లకు కూడా ఇది కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, అందరికీ ఒకేసారి రాకపోవచ్చు. ప్రాంతాలు, యూజర్ గ్రూపుల ఆధారంగా ఈ అప్డేట్‌ను దశలవారీగా విడుదల చేస్తున్నట్లు సమాచారం.

