Samsung Galaxy S26 Plus: ఏ ఫీచర్లు ఉండబోతున్నాయంటే?
Samsung ( Image Source: Twitter)
Technology News

Samsung Galaxy S26 Plus: లాంచ్‌కు ముందు లీకైన Samsung Galaxy S26 Plus ఫీచర్లు

Samsung Galaxy S26 Plus: మరో రెండు రోజుల్లో 2026 ఏడాది ప్రారంభం కానుంది. అయితే, ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ అభిమానుల దృష్టి ఇప్పటికే Samsung Galaxy S26 ఆకర్షించింది. తాజా లీక్‌లు, రూమర్ల ప్రకారం ఈ సిరీస్‌లో Samsung Galaxy S26, Galaxy S26 Plus, Galaxy S26 Ultra అనే మూడు మోడళ్లు మన ముందుకొచ్చే అవకాశం ఉంది. వీటిలో Galaxy S26 Plus, బేస్ మోడల్‌కి, అల్ట్రా వేరియంట్‌కి మధ్యలో ఉండే ఫోన్‌గా నిలవనుంది.

Also Read: Govt Land Scam: గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమి కబ్జా.. కాలనీ పేరుతో లే అవుట్.. కోట్ల విలువైన భూమికి కన్నం!

డిజైన్‌లో స్వల్ప మార్పులు

లీక్ అయిన సమాచారానికి అనుగుణంగా, Samsung Galaxy S26 Plus గత మోడల్‌తో పోలిస్తే కొంచెం స్లిమ్ గా రానుంది. అయితే, డిజైన్ పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని సమాచారం. సామ్‌సంగ్ తన ప్రీమియం లుక్‌ను కొనసాగిస్తూ, చిన్న రిఫైన్మెంట్స్‌కే పరిమితమవుతుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: MHSRB Recruitment News: నర్సింగ్ రిక్రూట్ మెంట్‌లో 2 వేల అబ్జక్షన్స్!.. సెకండ్ మెరిట్ లిస్టు మరింత ఆలస్యం

కెమెరా & డిస్‌ప్లే వివరాలు

Galaxy S26 Plusలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చని లీక్‌లు చెబుతున్నాయి. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇవ్వవచ్చని సమాచారం. డిస్‌ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 6.7-ఇంచుల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్తో రావొచ్చని అంచనా.

ప్రాసెసర్, బ్యాటరీ & పనితీరు

Samsung Galaxy S26 Plusలో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇది 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతకానుంది. బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుందని లీక్‌లు సూచిస్తున్నాయి. రోజువారీ వినియోగంతో పాటు హెవీ యూజర్లకు కూడా ఇది సరిపోతుందని భావిస్తున్నారు.

Also Read: Naa Anveshana: అమ్మాయి చీర కట్టు విధానం గురించి కాదు.. అబ్బాయి మైండ్ సెట్ మారాలి.. నా అన్వేష్

భారత్‌లో లాంచ్ తేదీ & అంచనా ధర

Samsung Galaxy S26 Plusను సిరీస్‌లోని ఇతర మోడళ్లతో కలిసి జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, కొన్ని రూమర్ల ప్రకారం, ఈ లాంచ్ ఫిబ్రవరి 2026 చివరి వరకు వాయిదా పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నాయి.

ధర విషయానికి వస్తే, భారత మార్కెట్‌లో ఈ ఫోన్ ధర రూ.95,000 నుంచి రూ.1,05,999 మధ్య ఉండవచ్చని అంచనా. అయితే, ఇవన్నీ లీక్‌లు, రూమర్ల ఆధారంగా వచ్చిన వివరాలు మాత్రమే కావడంతో, అధికారిక ప్రకటన వచ్చే వరకు వినియోగదారులు ఈ సమాచారాన్ని జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Just In

01

Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!

Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!

iPhone 16: తక్కువ ధరకే iPhone 16 కొనుగోలు చేసే ఛాన్స్

POCSO Act Case: మైనర్‌పై అత్యాచారం కేసులో మేడ్చల్ కోర్టు కీలక తీర్పు

SP Dr P Shabarish: అల్లర్లు తగ్గాయి.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయ్.. మహబూబాబాద్ క్రైమ్ రిపోర్ట్