Redmi Note 15 5G: షియోమీ తన రాబోయే Redmi Note 15 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ముఖ్య వివరాలను భారత మార్కెట్‌లో లాంచ్‌కు ముందే అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్‌లో ఉపయోగించే ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యంతో పాటు చార్జింగ్ సపోర్ట్, IP రేటింగ్, ధరల వంటి అంశాలపై కంపెనీ స్పష్టత ఇచ్చింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
Redmi Note 15 5G ఫోన్‌లో 6.77 అంగుళాల curved AMOLED డిస్‌ప్లే ఉండనున్నట్లు షియోమీ తెలిపింది. పనితీరు కోసం దీనిలో Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ అందించనున్నారు. ఈ చిప్‌సెట్ 10 శాతం GPU బూస్ట్, 30 శాతం CPU పనితీరు పెరుగుదల, అలాగే 48 నెలల వరకు ల్యాగ్-ఫ్రీ యూజ్ అనుభవం ఇస్తుందని కంపెనీ తెలిపింది.
కెమెరా విభాగంలో ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 108MP ప్రైమరీ కెమెరా అందించనున్నారు. దీనితో పాటు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌కు IP66 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది. అంటే దుమ్ము నుంచి రక్షణ ఉంటుంది. కానీ పూర్తిగా నీటిలో ముంచితే మాత్రం పని చేయదు.
Also Read: Nirmala Jaggareddy: గాంధీ పేరు తొలగించడం జాతికే అవమానం.. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి!
బ్యాటరీ విషయానికి వస్తే, Redmi Note 15 5Gలో 5,520mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు. ఈ బ్యాటరీతో 1.6 రోజుల వరకు వినియోగం సాధ్యమవుతుందని, అలాగే ఐదేళ్ల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని షియోమీ తెలిపింది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ HyperOS 2పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌ను స్పష్టంగా చెప్పకపోయినా, ఇది Android 15తోనే బాక్స్ నుంచి వచ్చే అవకాశముంది.
Also Read: Telangana Temples: ఆలయంలో ఇదేం తంతు.. పూజలు, టోకెన్ అంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం..!
ధర విషయానికి వస్తే, Redmi Note 15 5G ఫోన్ ధర రూ.20,000లోపు ఉంటుందని షియోమీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా విక్రయించనున్నారు. గతంలో లాంచ్ అయిన Redmi Note 14 భారత్‌లో రూ.18,999 ప్రారంభ ధరతో వచ్చింది. కొత్త Redmi Note 15 కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ధర OnePlus Nord CE 5, Infinix GT 30, Realme P4 వంటి ఫోన్లకి గట్టి పోటీ ఇస్తుంది.

