Motorola Edge 70: మోటరోలా ఎడ్జ్ 70 త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60కి అప్ గ్రేడ్ గా నవంబర్‌లో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. తెలిసిన సమాచారం ప్రకారం, ఇండియాకు వచ్చే వర్షన్ గ్లోబల్ మోడల్ కంటే కొన్ని ప్రత్యేకతలతో వస్తుంది. అందులో పెద్ద బ్యాటరీ, డిజైన్ ముఖ్య ఆకర్షణలు నిలవనున్నాయని సమాచారం. ఈ ఫోన్ చైనా-exclusive Moto X70 Air డిజైన్‌ను ప్రేరణగా తీసుకుని తయారు చేసిన అతి స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉండనుంది.
భారత లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్
టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@stufflistings) ఇచ్చిన సమాచారం ప్రకారం, Motorola Edge 70 భారత్‌లో డిసెంబర్ 15 నాటికి లాంచ్ కానుంది. ఫోన్ 5.99 మిమీ స్లిమ్‌గా ఉంటుందని సమాచారం. గ్యాలక్సీ S25 ఎడ్జ్, ఐఫోన్ ఎయిర్ లాంటి చిన్న స్లిమ్ ఫోన్స్‌తో ఇది పోటీ పడనుందని అంచనా వేస్తున్నారు. అధికారిక స్పెసిఫికేషన్స్ ఇంకా లీక్ కాలేదు, లీక్‌లలో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు.
Also Read: Nalgonda District: పంచాయతీ ఎన్నికల బహిష్కరణ చేసిన గ్రామం.. డప్పు చాటింపుతో సంచలనంగా మారిన వైనం..!
ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో మన ముందుకు రానుంది. అవి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో రానుంది. ప్రతి వెర్షన్‌లో Pantone వాలిడేషన్ లేబుల్ కూడా ఉంటుంది.
ఇక ధర విషయానికి వస్తే, యూకేతో పోలిస్తే ఇండియాలో ఫోన్ తక్కువ ధరకే లభించనుంది. యూకేలో GBP 700 (సుమారుగా రూ. 80,000) ధర ఉన్న ఫోన్, భారత్‌లో రూ.35,000 కు వస్తుంది. ఉదాహరణకు, Motorola Edge 60 12GB+256GB వెర్షన్ ధర భారత్‌లో రూ.25,999. మరిన్ని అధికారిక వివరాలు వచ్చే వారాల్లో తెలుస్తాయి. మొదటి డెబ్యూ ముందస్తు అంచనాలు ప్రకారం డిసెంబర్ మధ్యలో జరగనుందని సమాచారం.
