Upcoming Phones 2026: స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ప్లాన్ చేసే వాళ్ళు 2026 జనవరిలో కొనుక్కోవడం మంచిది, ఎందుకంటే ఏడాది ప్రారంభంలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో కొత్త కొత్త ఫోన్లు రానున్నాయి. Samsung, Xiaomi Redmi, Oppo వంటి ప్రముఖ బ్రాండ్లు తమ ఫేమస్ సిరీస్‌ల కొత్త మోడళ్లను జనవరి 2026లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. Galaxy S26 Series, Redmi Note 15 Series, Oppo Reno 15 Pro ఈ లిస్ట్‌లో ప్రధాన ఆకర్షణలు. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై-క్వాలిటీ కెమెరా వంటి టాప్ ఫీచర్లు ఈ ఫోన్లలో అందుబాటులోకి రానున్నాయి.
Samsung Galaxy S26 Series జనవరి చివర్లో విడుదల
Samsung Galaxy S26 Seriesలో S26, S26+, S26 Ultra మోడళ్లు ఉన్నాయి. ఇవన్నీ జనవరి 2026 చివరిలో లాంచ్ అయ్యే అవకాశముంది. Galaxy S26లో 6.3 అంగుళాల FHD+ OLED డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 / Exynos 2600 ప్రాసెసర్, 12GB RAM వరకు, 512GB స్టోరేజ్ వరకు అందుబాటులో ఉండవచ్చు. వెనుక మూడు కెమెరాలు, ముందు 12MP సెల్ఫీ కెమెరా, అలాగే 4300mAh బ్యాటరీ లభించవచ్చు.
Galaxy S26+, S26 Ultra ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో
Galaxy S26+ 6.7 అంగుళాల QHD OLED 120Hz డిస్ప్లేతో రానుంది. ఇది కూడా Snapdragon 8 Elite Gen 5 / Exynos 2600 ప్రాసెసర్‌తో రావచ్చు. 12GB RAM, 512GB స్టోరేజ్ ఇందులో లభించవచ్చని సమాచారం. Samsung Galaxy S26 Ultra మాత్రం ఈ లైనప్‌లో టాప్ మోడల్. ఇందులో 6.9 అంగుళాల QHD OLED 120Hz డిస్ప్లే, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 16GB RAM వరకు, 1TB స్టోరేజ్ వరకు అందుబాటులోకి రావచ్చు. బలమైన 200MP ప్రధాన కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్, 12MP లేదా 24MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశముంది.
Redmi Note 15 Series కూడా జనవరిలోనే రిలీజ్
Xiaomi Redmi Note 15 Series – Note 15, Note 15 Pro, Note 15 Pro Plus – జనవరి 2026లో భారత మార్కెట్లోకి వస్తాయి. Redmi Note 15లో Snapdragon 6 Gen 3 ప్రాసెసర్, 108MP + 8MP రియర్ కెమెరాలు, 20MP ఫ్రంట్ కెమెరా, 5520mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ చార్జింగ్ లభించవచ్చు.
Note 15 Pro , Pro Plus మోడళ్లు 200MP ప్రధాన కెమెరాతో రానున్నాయి. ఈ మూడు ఫోన్లలో 6.83 అంగుళాల FHD+ AMOLED 120Hz డిస్ప్లే అందుబాటులోకి రావచ్చు.
Oppo Reno 15 Pro కూడా జనవరిలోనే రిలీజ్
Oppo Reno 15 Pro కూడా జనవరి 2026లో విడుదల అయ్యే అవకాశముంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో రానుండగా, 6.7 అంగుళాల లేదా అంతకంటే పెద్ద AMOLED హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా , 120W ఫాస్ట్ చార్జింగ్ ముఖ్య ఆకర్షణలుగా ఉండనున్నాయి.

