Hari Chandana Dasari: దివ్యాంగులకు ప్రభుత్వం ప్రాధాన్యత
Hari Chandana Dasari (IMAGE credit: swetcha reporter)
Technology News, హైదరాబాద్

Hari Chandana Dasari: దివ్యాంగులకు ప్రభుత్వం ప్రాధాన్యత.. మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్లాలి : జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

Hari Chandana Dasari: దివ్యాంగులు మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ హరిచందన (Hari Chandana Dasari) దాసరి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చాదర్ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవ సందర్బంగా క్రీడల ఫ్లాగ్ ను ఆవిష్కరించి క్రీడాపోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలని వారిలో ధైర్యం నింపారు.”హమ్ కిసీ సే కమ్ నహి” అనే ఆలోచన తప్పక ఉండాలని అప్పుడే మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో రాణించి సమాజంలో అందరికీ స్ఫూర్తి కావాలన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, అలాగే ప్రభుత్వ రంగాల్లో దివ్యాంగుల కోట తప్పక అమలు చేయడం జరుగుతుందని, చదువుతోపాటు క్రీడల్లో ఎక్కువగా రాణించి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Also Read: Collector Harichandana: పక్కా ప్రణాళికతో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలి: కలెక్టర్ హరిచందన దాసరి

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి

ఈ క్రీడా కార్యక్రమములో దివ్యాంగ విద్యార్థిని, విద్యార్థులు దాదాపు 1500 మంది పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడల నిర్వహణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రీడల్లో భాగంగా దివ్యాంగులైన బాలబాలికలు అలాగే మహిళలు, పురుషులకు నాలుగు కేటగిరీలలో మూడు క్రీడాలను షాట్ పుట్, రన్నింగ్, చెస్ పోటీలు, అలాగే బధిర, వినికిడి లోపం ఉన్న వారికి షాట్ పుట్ జావలిన్ త్రో, రన్నింగ్, అలాగే మేధోవైకల్యం ఉన్న వారికి షాట్ పుట్, రన్నింగ్ క్రీడల పోటీలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో దివ్యాంగులు అనేక క్రీడల్లో

అంతర్జాతీయ స్థాయిలో దివ్యాంగులు అనేక క్రీడల్లో రాణించి దేశం గర్వించదగ్గ విశిష్ట పతకాలను కైవసం చేసుకున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అంతకుముందు క్రీడా ఫ్లాగ్ ను ఆవిష్కరించి మార్చి పాస్ట్ లో పాల్గొన్న విద్యార్థులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాజేందర్, దివ్యాంగ సంఘ ప్రతినిధులు కొల్లి నాగేశ్వరరావు, గంగారాం, నారా నాగేశ్వరరావు, పి. శ్రీనివాస్ రావు, పి. వెంకటేశ్వర్లు , ఎన్జీఓ ప్రతినిధులు పీఈ టీ లు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Adluri Laxman Kumar: గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్‌లు పెంచేందుకు ప్రభుత్వం సిద్దం

Just In

01

C-Mitra: సత్ఫలితాలిస్తోన్న ‘సీ-మిత్ర’.. 10 రోజుల్లో 1000 కాల్స్.. 100 ఎఫ్ఐఆర్‌లు నమోదు

Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?

Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. దయచేసి విమర్శలు చేయకండి

DGP Office Scandal: డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వైరలవుతున్న వీడియో.. సీఎం సీరియస్!

Crorepati Beggar: రోడ్డుపై భిక్షాటన భిక్షగాడికి 3 ఇళ్లు, 3 ఆటోలు, ఒక కారు.. నివ్వెరపోతున్న జనాలు!