Chennai Metro: ట్రాక్ మధ్యలో ఆగిపోయిన చెన్నై మెట్రో..
Metro ( Image Source: Twitter)
Technology News

Chennai Metro: ట్రాక్ మధ్యలో ఆగిపోయిన చెన్నై మెట్రో.. టన్నెల్‌ దారి నుంచి బయటకొచ్చిన ప్రయాణికులు

Chennai Metro: చెన్నై నగరంలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు అసలు ఊహించలేని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వింకో నగర్ డిపో దిశగా సాగుతున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో–హైకోర్టు స్టేషన్ల మధ్య టన్నెల్‌లో ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Local Body Elections: కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎక్కువ నామినేషన్లు.. విత్ డ్రా చేయించేందుకు రెండు పార్టీల నేతలు విశ్వ ప్రయత్నాలు

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం, రైలు టన్నెల్‌లో ఆగిన వెంటనే రైల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రయాణికులు కొన్ని నిమిషాల పాటు చీకటిలోనే చిక్కుకుపోయారు. కొంతమంది కిటికీల దగ్గరికి చేరి బయట ఏమైందో చూడాలని ప్రయత్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Pawan – Komatireddy: పవన్ క్షమాపణ చెప్పాలి.. లేదంటే సినిమాలు ఆడనివ్వం.. కోమటిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

తర్వాత మెట్రో సిబ్బంది అనౌన్స్‌మెంట్ చేస్తూ, రైలు నుండి దిగిపోవాలని, సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్‌ వరకు టన్నెల్‌లో నడవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు నడుచుకుంటూ భద్రంగా స్టేషన్‌కు చేరారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలోకి కూడా వచ్చేశాయి.

Also Read: CS Ramakrishna Rao: గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీఎస్.. భారీగా ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం

ఈ అంతరాయం విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య కారణంగా జరిగి ఉండొచ్చని అంటున్నారు.  అయితే, కొద్ది సేపటికే సమస్యను పరిష్కరించిన చెన్నై మెట్రో అధికారులు, బ్లూ లైన్ , గ్రీన్ లైన్ సర్వీసులు తిరిగి పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని ప్రకటించారు. ” ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెట్రో రైల్ లిమిటెడ్” ఎక్స్ లో ట్వీట్ చేసింది.

Just In

01

Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

Sircilla Panchayat Elections: రెండో దశ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ముందంజ.. దరిదాపుల్లో కూడా లేని బీజేపీ!

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!