Riki E-Rickshaw: బజాజ్ సరికొత్త ఈ-రిక్షా.. 164 కి.మీ నాన్ స్టాప్!
Bajaj Riki E-Rickshaw (Image Source: Twitter)
Technology News

Bajaj Riki E-Rickshaw: బజాజ్ సరికొత్త ఈ-రిక్షా.. ఒక్క ఛార్జ్‌తో 164 కి.మీ నాన్ స్టాప్.. ధర ఎంతంటే?

Bajaj Riki E-Rickshaw: ఆటోలకు ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎక్కడా చూసినా ఆటోలు దర్శనమిస్తుంటాయి. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అటువంటి ఆటోలను ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఒకటైన బజాజ్.. తాజాగా సరికొత్త ఈ-రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన మెుట్ట మెుదటి దేశీయ ఎలక్ట్రానిక్ ఆటోను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో దాని ఫీచర్లు, మైలేజ్, ధర తదితర వివరాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఈ-రిక్షా లాంచ్‌కు కారణం..

కరోనా తర్వాత ఈ – రిక్షా మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. ప్రతీ నెలా 45వేల వరకూ ఎలక్ట్రానిక్ ఆటోలు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. దీనిని గమనించిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్.. తొలిసారి ఈ-రిక్షా విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ-రిక్షా మార్కెట్ లో తన మార్క్ చూపించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ‘బజాబ్ రికీ ఈ-రిక్షా (Bajaj Riki E-Rickshaw)పేరుతో కొత్త ఎలక్ట్రానిక్ ఆటోను మార్కెట్ లోకి విడుదల చేసింది.

రెండు వేరియంట్లలో..

రికీ ఈ-రిక్షాను రెండు వేరియంట్లలో బజాజ్ లాంచ్ చేసింది. పీ4005 ప్యాసింజర్ (P4005 passenger), సీ4005 కార్గో (C4005 cargo) వేరియంట్లలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యాసింజర్ మోడల్ ధరను రూ.1.91 లక్షలుగా, కార్గో వేరియంట్ ను రూ.2.01 లక్షలుగా (ఎక్స్ షోరూం ధర) బజాజ్ నిర్ణయించింది.

బజాజ్ రికీ.. రేంజ్, ఫీచర్లు

బజాజ్ రికీ ప్యాసింజర్ వేరియంట్ 5.4 kWh లిథియం-అయాన్‌ బ్యాటరీని కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రూ. 149 కిమీ వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటివరకూ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఈ-రిక్షాలతో పోలిస్తే ఇది అతిపెద్ద సెగ్మెంట్ అని పేర్కొన్నాయి. అటు కార్గో వేరియంట్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 164 కి.మీ వరకూ ప్రయాణం చేయవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..

బజాజ్ రికీలోని రెండు వేరియంట్లు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయనున్నాయి. 0 నుంచి 100 శాతం ఛార్జ్ అయ్యేందుకు 4.5 గంటల సమయం పట్టనుంది. ఇక రికీ పాసెంజర్, రికీ కార్గో వేరియంట్ల బ్యాటరీలకు మూడేళ్ల వారంటీని బజాబ్ ఇస్తోంది. మోనోకోక్ ఛాసిస్ (Monocoque chassis), ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ (Independent Suspension), హైడ్రాలిక్ బ్రేకులు (Hydraulic brakes), దృఢమైన నిర్మాణాన్ని ఈ ఎలక్ట్రిక్ ఆటోలు కలిగి ఉన్నట్లు బజాబ్ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: Cold Wave: స్వెటర్లు రెడీ చేసుకోండి.. తెలంగాణ వాసులను గజగజ వణికించబోతున్న చలి.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

100 కంటే ఎక్కువ నగరాల్లో..

బజాజ్ రికీ ఈ-రిక్షాను తాజాగా లాంచ్ చేసినప్పటికీ మార్కెట్ లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశముంది. ప్రాథమిక దశలో ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, అసోం రాష్ట్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొని రావాలని కసరత్తు చేస్తున్నారు. 100 కంటే ఎక్కువ పట్టణాల్లో వీటిని ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో తెలుగు రాష్ట్రాల్లోనూ బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Telangana BJP: లోకల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కమలం సిద్ధం.. నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..!

Just In

01

C-Mitra: సత్ఫలితాలిస్తోన్న ‘సీ-మిత్ర’.. 10 రోజుల్లో 1000 కాల్స్.. 100 ఎఫ్ఐఆర్‌లు నమోదు

Minister Seethakka: మేడారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?

Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. దయచేసి విమర్శలు చేయకండి

DGP Office Scandal: డీజీపీ ఆఫీసులో రాసలీలలు.. వైరలవుతున్న వీడియో.. సీఎం సీరియస్!

Crorepati Beggar: రోడ్డుపై భిక్షాటన భిక్షగాడికి 3 ఇళ్లు, 3 ఆటోలు, ఒక కారు.. నివ్వెరపోతున్న జనాలు!