Telangana BJP: లోకల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కమలం సిద్ధం
Telangana BJP (imagecredit:twitter)
Political News, Telangana News

Telangana BJP: లోకల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కమలం సిద్ధం.. నెక్స్ట్ ప్లాన్ ఇదేనా..!

Telangana BJP: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ(BJP) ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన కమలం, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో నిలవాలని భావిస్తోంది. తద్వారా తామేంటో నిరూపించుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహరచనపై చర్చించేందుకు పలువురు కీలక నేతలు శంషాబాద్‌లో గురువారం భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ అభయ్ పాటిల్(Abhay Patil), సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి(Chandrashekhar Tiwari), రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: Tummala Nageswara Rao: యాసంగికి యూరియా సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం

ఈ నెల 30న బీజేపీ..

లోకల్ బాడీ, రాబోయే ఎన్నికలకు కీలకమైన జిల్లా ఇన్‌ఛార్జీల నియామకంపై ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. సమర్థులను ఇన్‌ఛార్జీలుగా నియమించాలని పార్టీ భావిస్తోంది. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిపైనా పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ నెల 30న బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(ML Santhosh) తెలంగాణకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన తొలిసారిగా రాష్ట్రానికి వస్తుండటంతో పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. నగర శివారులో జరగనున్న ఈ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై లోకల్ బాడీ ఎన్నికలతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముందని చెబుతున్నారు.

Also Read: WPL Auction: భారీ ధర పలికిన దీప్తి శర్మ.. ఎవరి ధర ఎంత?.. ప్లేయర్ల లిస్ట్ ఇదే!

Just In

01

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్

Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్‌ డుం డుం’.. వివరాలివే!

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!