WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 రిటెన్షన్ లిస్ట్ వచ్చిందంటే చాలు, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మొదలవుతుంది. నవంబర్ 27న న్యూఢిల్లీలో జరిగే మెగా వేలానికి ముందు జట్లు ఎవర్నీ దక్కించుకున్నాయి, ఎవర్నీ వదిలేశాయో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మన భారత స్టార్‌లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మలను జట్లు కట్టిపడేశాయి. కానీ మరోవైపు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు అలిస్సా హీలీ, మెగ్ లానింగ్, అమీలియా కేర్లను వదిలేయడం మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చింది.
1. హర్మన్‌ప్రీత్, స్మృతీ, జెమిమా లీడ్ రిటెన్షన్ లిస్ట్
భారత ఆటగాళ్ళు హర్మన్‌ప్రీత్ (MI), స్మృతీ (RCB), జెమిమా (DC) రిటెన్షన్ లిస్టులో టాప్‌లో నిలిచారు. ఇవే ఆటగాళ్లు లీగ్‌లో తమ జట్లకు వెన్నెముకలుగా ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు.
2. ముంబై ఇండియన్స్ ఛాంపియన్ కోర్‌ను నిలబెట్టింది
డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ తమ టీమ్ కోర్‌ను కొనసాగించింది – హర్మన్‌ప్రీత్, నాట్ సివర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమంజోట్, కమలినిని మళ్లీ రిటైన్ చేసుకున్నారు. అయితే, అమీలియా కేర్, క్లోయ్ ట్రయాన్ను రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.
3. ఢిల్లీ క్యాపిటల్స్ – మెగ్ లానింగ్‌ను రిలీజ్ చేసి యంగ్ టాలెంట్‌పై దృష్టి
DC జట్టు అనూహ్యంగా మెగ్ లానింగ్ ను విడుదల చేసింది. బదులుగా యువ ప్రతిభ నికీ ప్రసాద్ను, అలాగే శఫాలి వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మరిజాన్ కాప్లను కొనసాగించింది.
4. ఆర్‌సీబీ స్మార్ట్ మువ్ – ఒక RTM సేవ్
ఆర్‌సీబీ తమ బలమైన కోర్ టీం ను కొనసాగించింది – స్మృతీ మంధాన, ఎలిస్ పెర్రీ, రిచా ఘోష్, శ్రేయంక పటిల్లను రిటైన్ చేసింది. ఒక Right-To-Match (RTM) కార్డ్‌ను సేవ్ చేసి, వేలంలో సోఫీ డివైన్ లేదా రేణుక సింగ్ ను తిరిగి దక్కించుకునే అవకాశం తెచ్చుకుంది.
5. యూపీ వారియర్స్ – పూర్తి రీబిల్డ్ మోడ్‌లో
యూపీ వారియర్స్ భారీ మార్పులు చేసుకుంది. అలిస్సా హీలీ, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్లను రిలీజ్ చేసి, కేవలం శ్వేతా సెహ్రావత్ను మాత్రమే కొనసాగించింది. వీరి వద్ద ఇప్పుడు రూ.14.5 కోట్ల భారీ పర్స్ ఉంది.
6. గుజరాత్ జెయింట్స్ – మూనీ, గార్డ్నర్‌తో కొనసాగింపు
గుజరాత్ జెయింట్స్ తమ కీలక ద్వయం బెత్ మూనీ, ఆష్లీ గార్డనర్ ను కొనసాగించగా, లారా వోల్వార్డ్, ఫీబీ లిచ్‌ఫీల్డ్ను విడిచిపెట్టింది. కొత్త సీజన్‌లో కొత్త కాంబినేషన్‌లతో తిరిగి బలంగా వచ్చే ప్రయత్నంలో ఉంది.
7. RTM రూల్‌తో వ్యూహాత్మక ట్విస్ట్
మొదటిసారిగా WPL చరిత్రలో జట్లకు Right-To-Match (RTM) కార్డులు ఇచ్చారు. దీంతో, జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లను వేలంలో తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది ఈసారి వేలాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చబోతోంది.
8. జట్ల పర్స్ వివరాలు
MI & DC: రూ. 5.75 కోట్లు మిగిలి ఉన్నాయి
RCB: రూ. 6.25 కోట్లు
GG: రూ. 9 కోట్లు
UPW: రూ. 14.5 కోట్లు – అతి పెద్ద పర్స్
9. వేలంలో దూసుకువచ్చే స్టార్‌లు
ఈసారి వేలంలో అలిస్సా హీలీ, మెగ్ లానింగ్, అమీలియా కేర్, లారా వోల్వార్డ్, దీప్తి శర్మ లాంటి టాప్ ప్లేయర్లు హైలైట్‌గా నిలవబోతున్నారు.
10. కొత్త టాలెంట్‌కు ప్రాధాన్యం
జి. కమలినీ (MI), నికీ ప్రసాద్ (DC) లాంటి కొత్త భారతీయ ప్రతిభావంతులపై జట్లు నమ్మకం చూపించాయి. దీని బట్టి యువ ఆటగాళ్లు ఇప్పుడు WPL భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతున్నారని స్పష్టమవుతోంది.
మొత్తంగా, WPL 2026 వేలం కొత్త వ్యూహాలతో, పెద్ద పర్స్‌లతో, ఆతృతతో నిండిన సీజన్‌గా మారబోతోంది. అభిమానులకు మరింత ఉత్కంఠ, జట్లకు కొత్త అవకాశాలు — ఇదే ఈ సీజన్ స్పెషల్..
