Womens T20 WorldCup tournamnet 2024 In Srilanka Country: 2024 ఏడాదిలో మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు శ్రీలంక దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. జూలై 18 నుంచి 28 వరకు దంబుల్లాలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. అయితే.. 2022లో చివరిసారి బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ టోర్నిలో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఏడోసారి టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఏడాది క్రితం ఏడు టీమ్స్ ఇందులో పాల్గొనగా.. ఈసారి ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయని జైషా ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇక, గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్.. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్‌లాండ్ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్నాయి. భారత్ తమ మూడు లీగ్ మ్యాచ్‌లను వరుసగా యూఏఈ జూలై 19న, పాకిస్తాన్ జూలై 21న, నేపాల్ జూలై 23న జట్లతో తలపడనుంది. జూలై 26వ తేదీన సెమీ ఫైనల్స్ జూలై 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని శ్రీలంక రెడీ అవుతోంది. షెడ్యూల్ జులై 23న ది హండ్రెడ్ 2024 ప్రారంభంతో విభేదిస్తుంది. అంటే భారత్‌కి చెందిన స్మృతి మంధాన (సదరన్ బ్రేవ్), రిచా ఘోష్ (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్), శ్రీలంక సారథి చమరి అథాపత్తు (ఓవల్ ఇన్విన్సిబుల్స్) అందరూ తమ తమ జట్టులో ఆలస్యంగా చేరే ఛాన్స్ ఉంది.