WI vs NZ The Quality Of Sherfanes Innings Was The Difference Kane Williamson
స్పోర్ట్స్

Sports News:ఘోర పరాజయం పాలైన న్యూజిలాండ్

WI vs NZ The Quality Of Sherfanes Innings Was The Difference Kane Williamson: సూపర్ 8 ఛాన్సులు మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర పరాజయం పాలైంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే తదుపరి దశకు చేరే చాన్సులు సంక్లిష్టం చేసుకుంది. ట్రిండాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ అజేయ అర్థశతకంతో చెలరేగాడు. బౌల్ట్ మూడు, సౌథి, ఫెర్గూసన్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ 30 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి సవాలైన లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది.గ్లెన్ ఫిలిప్స్ టాప్ స్కోరర్. మిచెల్ శాంట్నర్ పోరాడాడు. అల్జారీ జోసెఫ్ , మొటియి సత్తాచాటారు. కాగా, మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ తమ జట్టు ప్రదర్శన, ఓటమి గల కారణాలు వివరించాడు. రూథర్‌ఫర్డ్ అద్భుత ప్రదర్శన తమ ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. పవర్‌ప్లేలో తమ బౌలర్లు 23 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్ల తీయడంపై మాట్లాడుతూ.. పవర్‌ప్లే బాగుంది. సరైన ప్రదేశాల్లో బంతుల్ని సంధిస్తే మంచి ఫలితం వస్తుందని ఆశించాం, అదే జరిగింది. ఇలాంటి పిచ్‌లపై ఒక ఓవర్ లేదా రెండు ఓవర్లు మ్యాచ్‌ను తారుమారు చేస్తాయి.

Also Read: పాక్‌పై భారత్ రికార్డు

రూథర్‌ఫర్డ్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. లోతైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం వెస్టిండీస్‌కు కలిసొచ్చింది. వికెట్లను సాధించడానికి మేం దూకుడైన తీరును అవలంబించాం. ఈ క్రమంలో కఠిన ఓవర్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించామని విలియమ్సన్ అన్నాడు. శాంట్నర్‌తో ఆఖరి ఓవర్ వేయించిన కివీస్ వ్యూహం దారుణంగా విఫలమైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది రూథర్‌ఫర్డ్ 18 పరుగులు పిండుకున్నాడు.దీని గురించి స్పందిస్తూ మా వ్యూహంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇక్కడ రెండు మూడు బంతులతో ఫలితం మారుతోంది. ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి. మేం సాకులు చెప్పాలనుకోవట్లేదు. తిరిగి గొప్పగా పుంజుకోవాలనుకుంటున్నాం. తర్వాత జరగనున్న మ్యాచ్‌లో స్మార్ట్‌గా ఆడాలని భావిస్తున్నామని కేన్ విలియమ్సన్ అన్నాడు. భారత కాలమాన ప్రకారం జూన్ 15న ఉగాండతో, జూన్ 17న పపువా న్యూగినియాతో న్యూజిలాండ్ తలపడనుంది.

Just In

01

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు