Who Will Be The Next Head Coach Of Team India
స్పోర్ట్స్

Team India: టీమిండియా హెడ్‌ కోచ్‌గా నెక్స్ట్‌ ఎవరంటే..?

Who Will Be The Next Head Coach Of Team India? టీమిండియా హెడ్‌ కోచ్‌గా ప్రస్తుతం రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత ఎవరన్న అంశంపై క్రికెట్‌ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అప్లికేషన్స్‌ని ఆహ్వానించింది. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఛాన్స్‌లు ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం రిక్కీ పాంటింగ్‌, మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, ఆర్సీబీ కోచ్‌ ఆండీ ఫ్లవర్ టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే రిక్కీ, లాంగర్‌ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జైషా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్‌ ఇవ్వలేదంటూ కౌంటర్‌ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఆఫర్‌ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ నాకైతే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే ఏదేని జట్టుకు కోచింగ్‌ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే టైంలో నన్ను ఇబ్బందిపెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది.భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.

Also Read: కేవలం ఆ నిర్ణయం వల్లే ఓటమి..! 

కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. ​చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంతమంది యువ ఆటగాళ్లకు మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంతమంది ఆటగాళ్లతో కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్‌ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన టైం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే ముందుగా చెప్పినట్లు కోచ్‌ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా అని ఏబీ డివిలియర్స్‌ పేర్కొన్నాడు.

Just In

01

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!