kohli-ipl
స్పోర్ట్స్

Virat Kohli – IPL: కింగ్ వచ్చేశాడు..

బెంగళూరుకు కోహ్లీ.. ఆర్సీబి ఫ్యాన్స్ హంగామా

Virat Kohli – IPL: ఐపీఎల్ 2025 సీజన్ లో పాల్గొనేందుకు కింగ్  కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఆర్సీబి ఫ్యాన్స్  ‘కింగ్ వచ్చేశాడు’ అంటూ హంగామా చేస్తున్నారు. టైటిల్ గెలిచినా..గెలవకపోయినా.. ఐపీఎల్ టీముల్లో అధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఏదంటే అది ఆర్సీబి..ఇంక విరాట్ కోహ్లీ అంటే చాలు ..వెర్రెక్కి పోతారు ఫ్యాన్స్..ఇక శనివారం బెంగళూరు ఎయిర్ పోర్టులో కోహ్లీ దిగిన విషయం నిమిషాల్లోనే వైరల్ గా మారింది.  ఈ నెల 22న మొదలయ్యే ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్ ను ఢీకొట్టనుంది.  ఈ సందర్భంగా కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ ఎదుగుదల, ఆటపట్ల అతని కమిట్ మెంట్ పూర్తిగా తెలిసిన కోహ్లీ..అతను కెప్టెన్ గా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేసాడు.

Also Read- KKR TEAM: కేకేఆర్ మళ్లీ మేజిక్ చేస్తుందా..?

కోహ్లీ రికార్డుల మోత

ఐపీఎల్ లో కింగ్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికి 252 మ్యాచ్ ల్లో 8004 పరుగులు చేసాడు. ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ చేసింది కోహ్లీనే. 2013-2021 సీజన్లలో ఆర్సీబీకి నాయకత్వం వహించిన విరాట్ బ్యాటర్ గా రాణించినా టైటిల్ దక్కలేదు. ఇక  2016 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లోనే 973 పరుగులు చేసాడు. ఆర్సీబి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. 2022 సీజన్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక ప్రస్తుత  సీజన్ లో అందరి చూపూ కోహ్లీ మీదే ఉంది.

ఐపీఎల్ ఒక్కటీ అందుకుంటే..

క్రికెట్ లో రికార్డుల రారాజుగా కొనసాగుతున్నాడు. ప్రపంచకప్ అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. చాంపియన్స్ ట్రోపీ సాధించాడు. ఇలా ఎక్కడ ..ఏ స్థాయిలో క్రికెట్ ఆడినా విజేతగా నిలిచాడు. ట్రోఫీలు గెలుచుకున్నాడు. కానీ అతని క్రికెట్ జీవితంలో ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఐపీఎల్ టైటిల్ గెలుచుకోలేకపోవడం..ఎంతగా ప్రయత్నించినా.. మూడుసార్లు ఆర్సీబి ఫైనల్ చేరుకున్నా కోహ్లీ టైటిల్ ఆశ నెరవేరలేదు.

2008 నుంచి ఒక్కటే టీమ్ .. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్నాడు. ప్రతి ఏడాది కూడా బ్యాటర్ గా విఫలమైంది లేదు. ఐపీఎల్ అంటే కోహ్లీలోని అసలైన బ్యాటర్ బయటకు వస్తాడనేలా.. ఏ ఒక్కరూ ఊహించనట్లుగా.. ధనాధన్ షాట్లతో హడలెత్తిస్తుంటాడు. గేల్ తో కలిసి ధూంధాం చేశాడు. డివిలియర్స్ తో కలసి విధ్వంసం చేశాడు. స్వయంగా ఐపీఎల్ లో సెంచరీల మోత మోగించాడు. అయినా టైటిల్ దక్కలేదు.

ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ విజయంతో మాంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. మళ్లీ ఫాం అందుకున్నాడు. ఫిట్ నెస్ పరంగానూ.. బ్యాటింగ్ లోనూ మళ్లీ పాత కోహ్లీ కనిపిస్తున్నాడు. ఇక ఈ సీజన్ లోనూ అతను చెలరేగుతాడని ఆర్సీబి జట్టు భావిస్తోంది. కవర్ డ్రైవ్స్ మళ్లీ అద్భుతంగా కొడుతున్నాడు. సహనంతో క్రీజులో నిలుస్తున్నాడు. సమయానుకూలంగా బ్యాటింగ్ లో గేర్ మారుస్తున్నాడు. అన్నీ కలిసి వస్తే.. జట్టుగా ఆర్సీబి రాణిస్తే.. మిగిలిన ప్లేయర్లలో కనీసం ఇద్దరు కోహ్లీకి సహకరిస్తే..ఈసారి అతని  ఐపీఎల్ టైటిల్ కల నిజమయ్యేలా కనిపిస్తోంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు