Usa Played Extremely Well Pakistan Didnt Deserve To Win Shoaib Akhtar
స్పోర్ట్స్

T20 Match: పాకిస్థాన్‌ టీమ్‌పై షోయబ్ అక్తర్ అసహనం

Usa Played Extremely Well Pakistan Didnt Deserve To Win Shoaib Akhtar: అమెరికా చేతిలో పాకిస్థాన్ అనూహ్య పరాజయాన్ని చవిచూడటంపై ఆ దేశ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ రియాక్ట్ అయ్యాడు. పాక్ ఓటమి తనని ఎంతగానో బాధించిందని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024‌లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో ఓటిమిని మూటగట్టుకుంది. డల్లాస్ వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ పోరులో పాక్ కాస్త తడబడింది. మొదట పాకిస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 రన్స్ చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ టాప్ స్కోరర్. కెంజిగె, సౌరభ్‌ నేత్రావల్కర్‌ సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులే చేసింది. సారథి మొనాంక్ పటేల్‌ హాఫ్ సెంచరీ సాధించాడు. మహ్మద్ అమీర్, నసీమ్ షా, హారిస్ రవూప్ తలో వికెట్ తీశారు.స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ వికెట్ నష్టానికి 18 రన్స్‌ చేసింది. అయితే మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత అమీర్ లయ తప్పడం, పేలవ వికెట్ కీపింగ్‌తో ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నారు. అనంతరం సూపర్ ఓవర్ ఛేదనలో పాకిస్థాన్ వికెట్ కోల్పోయి 13 పరుగులే చేసింది. సౌరభ్‌ నేత్రావల్కర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ గొప్పగా ఆరంభించలేదు. అమెరికా చేతిలో ఓటమిపాలై తీవ్ర నిరాశ కలిగించింది.

1999 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో కోరుకోని ఓటమి చవిచూసినట్లుగానే ఈ టోర్నీలో అపకీర్తి మూటగట్టుకున్నాం. అయితే ఈ మ్యాచ్‌లో విజేతగా నిలవడానికి పాకిస్థాన్‌కు అర్హత లేదు. యూఎస్‌ఏనే బాగా ఆడింది. శాసించే స్థానంలో నిలిచింది. అమీర్, షాహిన్ అఫ్రిది మ్యాచ్‌ను కాపాడటానికి ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయామని షోయబ్ అక్తర్ అన్నాడు. 1999 వన్డే వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం టోర్నీలో కసితో ఆడి ఫైనల్‌కు చేరింది. కానీ తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌ను చేజార్చుకుంది. కాగా, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ పాకిస్థాన్ జింబాబ్వే చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్‌కు చేరింది. కానీ టైటిల్ పోరులో తడబడి కప్‌ను మిస్ చేసుకుంది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు