Team India
స్పోర్ట్స్

Team India | డ్యూ ఫ్యాక్టర్..మందకొడి పిచ్ లు.. టీమిండియాకు కష్టమేనా..?

Team India | దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ముందంజపై కాస్తంత ఆందోళన కనిపిస్తోంది. యూఏఈలో (uae) పిచ్‌లపై డ్యూఫ్యాక్టర్ అధికంగా ఉండటంతో అవి నెమ్మదిగా ఉంటాయని అంచనాల నేపథ్యంలో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుత టీమిండియా మందకొడి పిచ్ లపై తడబడుతోంది. 2023 ప్రపంచకప్ ఫైనల్లోనూ అహ్మదాబాద్ పిచ్ పై టీమిండియా తడబడి కొద్దిలో ట్రోఫీ మిస్సైంది. ఇప్పుడు దబాయ్ లోనూ మందకొడి పిచ్ లంటే దీంతో టాస్‌ కీలకంగా మారనుంది. ఈనేపథ్యంలో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఏమేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిదే. గతంలో ఇక్కడ జరిగిన ఐపీఎల్‌ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ల్లో పిచ్ లు సీమర్లకు మాత్రమే ఎక్కువ సహకరించాయి. 2018 నుంచి 35 మ్యాచ్‌ల జరగ్గా.. రికార్డులు చూస్తే ఆసీస్‌, పాక్‌ మాత్రమే 300కు పైగా స్కోర్లు చేశాయి. ఈ మ్యాచ్‌ల గణాంకాల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌ సగటు మొత్తం 218 మాత్రమే.

 

అంటే జట్టు విజయం సాధించడానికి అవసరమైన సగటు స్కోరు 252. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 14 సార్లు గెలువగా.. 19 సార్లు ఓడిపోయాయి. ఒకటి టై కాగా.. మరొకటి ఫలితం తేలలేదు. దీంతో టీమిండియా పరిస్థితి ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. పైగా టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు వన్డే ఫార్మాట్‌ ప్రిపరేషన్‌ కొంత ఆందోళనకరంగా ఉంది.. 2017 నుంచి ఐసీసీ వన్డే టోర్నమెంట్ల సమయంలో సన్నద్ధతతో పోలిస్తే ఈసారి పరిస్థితి అంత గొప్పగా ఏమీలేదు. భారత్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లో ఆడిన మ్యాచ్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. మనకంటే తక్కువ ఆడిన జట్టు కేవలం ఐర్లాండ్‌ మాత్రమే. 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఏడాది ముందు భారత్‌ 11 వన్డేలు ఆడగా.. 26 మంది ఆటగాళ్లకు అవకాశం లభించింది.

 

2019 ప్రపంచకప్‌నకు ముందు 27 మ్యాచ్‌లు ఆడగా.. 26 మంది ఆటగాళ్లను పరీక్షించింది. ఇక 2023 వన్డే ప్రపంచకప్‌ ముందు ఏడాదిలో భారత్‌ ఏకంగా 30 మ్యాచ్‌లు ఆడింది.. ఈ సందర్భంగా దాదాపు 34 మంది ఆటగాళ్లను పరీక్షించింది. 2023 ప్రపంచకప్‌ తర్వాత ఇప్పటివరకు భారత్‌ 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. వీటిల్లో 27 మంది ఆటగాళ్లను పరీక్షించి చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసింది. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడుతున్న జట్లలో భారత్‌ మాత్రమే గత వన్డే ప్రపంచకప్‌ ముగిశాక అతితక్కువ వన్డేలు ఆడింది. ఆస్ట్రేలియా 12, దక్షిణాఫ్రికా 14, పాకిస్థాన్‌ 11, ఇంగ్లాండ్‌ 14, అఫ్గానిస్థాన్‌ 14, న్యూజిలాండ్‌ 11, బంగ్లాదేశ్‌ 12 ఆడాయి. అందుకే మన సన్నద్ధత సరిపోదనుకుంటున్నా.. టాపార్డర్ సహా భారత ప్లేయర్లందరూ ఫాంలో ఉండడం.. రోహిత్, కోహ్లీ అద్భుత రికార్డు భారత్ విశ్వాసాన్ని పెంచుతోంది.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్