Sports news:వచ్చాడయ్యా..పరుగుల సామి
Thompson cross the record
స్పోర్ట్స్

Sports news:వచ్చాడయ్యా..పరుగుల సామి

Thompson win 100-metre titles at Jamaican Olympic trials cross the record Ussain Bolt

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తి ఎవరంటే ఠక్కున చెప్పేస్తాం ఉసేన్ బోల్ట్ . అతని అనితరసాధ్యమైన రికార్డులు ఇప్పటిదాకా ఎవరూ అధిరోహించలేకపోయారు. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్‌కు అతడు తెచ్చిన క్రేజ్‌ అలాంటిది. బోల్ట్‌ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. బోల్ట్‌ రికార్డులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

ఆ రికార్డులు చెదురుతాయో లేదో గానీ.. వేగంలో ఉసేన్‌ను గుర్తుచేస్తూ అతడి దేశం జమైకా నుంచే మరో చిరుత దూసుకొస్తోంది. 100 మీటర్ల పరుగులో ఈ రెండేళ్లలోనే అత్యుత్తమ టైమింగ్‌ నమోదు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఆ అథ్లెటే కిషేన్‌ థాంప్సన్‌. జమైకా ట్రయల్స్‌లో 9.77 సెకన్లు నమోదు చేసిన థాంప్సన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఒలింపిక్స్‌లో థాంప్సన్‌కు గట్టిపోటీ ఎదురు కానుంది. అమెరికా స్టార్లు కోల్‌మన్, నోవా లేల్స్, ఫ్రెడ్‌ కెర్లీ బరిలో ఉన్నారు. మరి వారి పోటీని తట్టుకుని థాంప్సన్‌ నిలవగలిగితే ఉసేన్‌ వారసుడు వచ్చేసినట్టే.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?