Modi AmitShah In The Case Of Team India Head Coach Fake Applications To BCCI
స్పోర్ట్స్

BCCI Fake Applications: మెయిన్‌ కోచ్ కోసం ఫేక్

The Team India Head Coach Fake Applications To BCCI: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం ఈనెల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది బీసీసీఐ. ఈ గడువు ముగిసే టైమ్‌కి సుమారు 3వేల అప్లికేషన్స్‌ అందినట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే వాటిలో భారీ సంఖ్యలో నకిలీ అప్లికేషన్‌లు ఉన్నాయి. అందుకోసం కొందరు ఆకతాయిలు భారత ప్రధాని మోదీ, హెంమంత్రి అమిత్‌ షా, క్రికెట్‌ ప్లేయర్‌లు సచిన్‌ తెందూల్కర్‌, ఎంఎస్‌ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి ప్రముఖుల పేర్లను ఉపయోగించారు. వారి పేరిట ఫేక్ అప్లికేషన్లను పంపారు.

ఇప్పటివరకు అందిన దరఖాస్తుల్లో చాలా వరకు మాజీ క్రికెటర్లు, ప్రముఖ నేతల పేర్లతో ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది.బీసీసీఐ ఇప్పుడు వాటిని ఏరివేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే కోచ్ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ క్రికెట్‌ దిగ్గజాల పేర్లు గతంలో వినిపించాయి. మరోసారి భారతీయుడే ఉంటాడా..? విదేశీ కోచ్‌ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతుందో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత తదుపరి కోచ్‌ గురించి అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. ఈ నెల స్టార్టింగ్‌లో హెడ్‌ కోచ్‌ పదవికి ప్రకటన ఇస్తూ బీసీసీఐ ఒక గూగుల్ ఫామ్‌ను తన వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. ఇంకేముంది కోచ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు నిన్నటితో ముగిసింది.ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరినాటికి ముగుస్తుంది. జూన్ 1 నుంచి పొట్టి కప్‌ ప్రారంభం కానుంది.

Also Read: ఆ ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేశా..!

ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ముగిసే వరకూ అతడే కోచ్‌గా ఉంటాడు. ఆ తర్వాత కొత్త కోచ్‌ పదవీకాలం జులై 1 నుంచి మొదలై 2027 డిసెంబరు 31 వరకు మూడున్నరేళ్ల పాటు కొనసాగనుంది. అంటే కొత్తగా బాధ్యతలు చేపట్టే కోచ్‌ 2027లో జరిగే తదుపరి వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ముగిసే వరకు ఈ పదవిలో ఉంటారు. ద్రవిడ్ మళ్లీ ఆ పదవిలో కొనసాగాలనుకుంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని గతంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించారు. అయితే ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించాలనుకున్న అతడు మళ్లీ దరఖాస్తు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!