Tennis Legend Rafael Nadal Once Again Make Noise In Paris
స్పోర్ట్స్

Sports News: ఒలింపిక్స్ బరిలో…

Tennis Legend Rafael Nadal Once Again Make Noise In Paris: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశ పరిచిన స్పెయిన్ టెన్నిస్ లెజెండ్‌ రఫెల్‌ నడాల్‌ పారిస్‌లో మరోసారి సందడి చేయనున్నాడు. పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. తమ దేశానికి చెందిన యంగ్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్‌తో కలిసి ఒలింపిక్స్‌ డబుల్స్‌లో నడాల్‌ పోటీ పడతాడని స్పెయిన్ టెన్నిస్ ప్రకటించింది. 21 ఏండ్ల అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి టైటిల్ నెగ్గాడు.

అతని కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. కాగా 38 ఏండ్ల నడాల్ 22 గ్రాండ్ స్లామ్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో రెండు గోల్డ్‌ మెడల్స్‌ నెగ్గాడు. 2008లో సింగిల్స్ టైటిల్‌ నెగ్గిన అతను 2016లో మార్క్‌ లోపేజ్‌తో కలిసి డబుల్స్‌లో బంగారం కైవసం చేసుకున్నాడు. స్పెయిన్ జాతీయ జట్టు కోచ్, మాజీ అగ్రశ్రేణి ఆటగాడు అయిన డేవిడ్ ఫెర్రర్, కలల జతను అనౌన్స్ చేయడంతో తన ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రతి ఒక్కరికి తెలిసిన జంట అద్భుతం అని అది కూడా కార్లోస్ అల్కరాజ్, రాఫెల్ నాదల్ అని నేను భావిస్తున్నానని ఫెర్రర్ ప్రకటించాడు. రాఫా మరియు కార్లోస్ పారిస్‌లో కలిసి జోడీగా ఆడతారు. నాదల్ 2008లో బీజింగ్ గేమ్స్‌లో సింగిల్స్‌లో తన మొదటి ఏకైక ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది అతని అద్భుతమైన కెరీర్‌లో కిరీటమని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?