Team India Cricketer | పెద్దల సమక్షంలో ఒక్కటైన జంట
Team India Cricketer Venkatesh Iyer Got Married
స్పోర్ట్స్

Team India Cricketer: పెద్దల సమక్షంలో ఒక్కటైన జంట

Team India Cricketer Venkatesh Iyer Got Married: టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ బ్యాచ్‌లర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పేసి తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్‌ని పెళ్లి చేసుకున్నాడు. సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం రోజు వీరి పెళ్లి సాంప్రదాయ పద్దతిలో జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వెంకటేష్ అయ్యర్ పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలిసి నెటిజన్స్, క్రికెట్ లవర్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వెంకటేష్ అయ్యర్ విషయానికొస్తే.. 1994 డిసెంబర్ 5న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో తన ఆట తీరుతో ఆకట్టుకున్న ఈ ఆల్ రౌండర్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.ఇండియా వేదికగా న్యూజిలాండ్‌తో టీ 20 సందర్భంగా ఇంటర్నేషనల్ టీ 20లో ఎంట్రీ ఇచ్చిన అయ్యర్, మునుపటి ఏడాదే వన్డేలోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 2 వన్డేలు, 9 టీ 20 మ్యాచ్‌లు ఆడి 24,133 పరుగులు సాధించాడు. అలాగే తన టీ 20 ఫార్మాట్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ఒంటి చేత్తో కోల్‌కతా నైట్ రైడర్స్‌ని గెలిపించి కోల్‌కతా ఛాంపియన్స్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు.

Also Read: క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌కి నటి చెక్‌

వెంకటేశ్ అయ్యర్ ప్రతిభను విశ్వసించిన కేకేఆర్ గత మెగా వేలానికి ముందు 2022లోనూ రిటైన్ చేసుకుంది. ఈసారి కూడా వెంకటేశ్‌ను తమ ఫ్రాంచైజీలోనే కొనసాగించాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఐపీఎల్‌లో ఈ ఆల్‌రౌండర్ 50 మ్యాచ్‌లు ఆడాడు. 1326 పరుగులు, మూడు వికెట్లు సాధించాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. టీమిండియా తరఫున రెండు వన్డేలు, తొమ్మిది టీ20లు ఆడాడు. చివ‌ర‌గా 2022 ఫిబ్ర‌వ‌రిలో టీమిండియాకు వెంకటేశ్ ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..