T20 WorldCup 2024 South Africa Wins On West Indies South Africa In To Semi Final
స్పోర్ట్స్

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌కి షాక్‌

T20 WorldCup 2024 South Africa Wins On West Indies South Africa In To Semi Final: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రపంచకప్‌లో గ్రూప్-2 నుండి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాయి. అమెరికాపై ఇంగ్లండ్ విజయం సాధించి నాకౌట్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై గెలిచి తదుపరి దశకు చేరుకుంది. సెమిస్ రైస్ కోసం సోమవారం వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

సెమీస్‌ రేసులో కీలకమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. డక్ వర్త్ లూయీస్ నిబంధనతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు మరోసారి పేలవమైన ఆట తీరును కనబరిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 135 రన్స్‌ మాత్రమే చేశారు. అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో దిగిన సౌతాఫ్రికాకు రస్సెల్ ఒకే ఓవర్ లో ఓపెనర్లు ఇద్దరిని అవుట్‌ చేసి షాక్ ఇచ్చాడు.

Also Read: రికార్డు బద్దలు

కానీ ఇంతలో వర్షం కారణంగా దాదాపు ఒక గంటపాటు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో డీఎల్ఎస్ పద్దతి ద్వారా వర్షం ఆగిన తర్వాత 17 ఓవర్లకు 123 రన్స్ లక్ష్యాన్ని సౌతాఫ్రికాకు ఇవ్వగా చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అయినప్పటికి స్వల్ప స్కోరును సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి చేధించింది. దీంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆ జట్టు నేరుగా సెమీ ఫైనల్ చేరుకుంది. కాగా గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ చేరాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు