T20 World Cup Travis Head Believes India Seeks Revenge Against Australia
స్పోర్ట్స్

Viral News: భారత్ టీమ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు

T20 World Cup Travis Head Believes India Seeks Revenge Against Australia: టీ 20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో భారత్‌ ఆస్ట్రేలియా తలపడితే ఆసక్తికరంగా ఉంటుందని బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమతో తుదిపోరు జరగాలని భారత క్రికెట్ అభిమానులు సైతం కోరుకుంటున్నారని ఈ ఆసీస్ ఎడమచేతి వాటం బ్యాటర్ అన్నారు.గతేడాది జరిగిన వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటుందని హెడ్ పేర్కొన్నారు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. టోర్నీ ఆద్యంతం సత్తాచాటిన రోహిత్‌ తుదిమెట్టుపై బోల్తాపడి ట్రోఫీలను చేజార్చుకుంది.

ఈ రెండు తుదిపోర్లలోనూ ట్రావిస్ హెడ్‌ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. సెంచరీలతో కదం తొక్కి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. గత పొరపాట్లను సరిదిద్దుకొని భారత్ మరో మహా సమరానికి సిద్దమైంది. టీ20 వరల్డ్‌కప్ వేట కోసం బయలుదేరింది. సూపర్ 8 దశకు ఇరు జట్లు అర్హత సాధించడం సులువే. కానీ ఫైనల్స్‌కి చేరుకోవాలంటే టఫ్‌ ఫైట్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే భారత్‌ ఆసీస్ మధ్య టైటిల్ పోరు జరిగితే ఆడియెన్స్ థ్రిల్లింగ్‌ ఫీల్‌ అవుతారని హెడ్ అన్నారు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియా తలపడితే ఎంతో బాగుంటుంది. గత రెండు ఐసీసీ ఫైనల్స్‌ని దృష్టిలో పెట్టుకొని, అదే జట్లు మరోసారి టైటిల్ పోరులో పోటీ చేయాలని ఇండియాలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Also Read: ఆ ఆటగాడికి భారీ డిమాండ్ 

మాపై రివేంజ్ తీర్చుకోవాలని భారత్ తప్పకుండా వెయిట్ చేస్తుందని ఆయన అన్నారు. ఫైనల్స్‌కు ఇరుజట్లు వస్తే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. తుదిపోరులో మేం రావాలని అలాగే భారత్ కూడా రావాలని కోరుకుందాం. ప్రస్తుతం భారత్ మంచి స్థితిలో ఉంది. టాప్ 4లో టీమిండియా ఉండే ఛాన్స్‌లు అధికంగా ఉన్నాయి. అయితే ఎటాకింగ్‌ గేమ్‌ ఆడటం ఆ జట్టుకు ఎంతో కీలకం. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రిత్ బుమ్రాతో జట్టు బలంగా ఉంది. ఐపీఎల్‌లో బుమ్రా అద్భుతంగా రాణించారని ట్రావిస్ హెడ్ అన్నాడు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?