T20 Match irland Vs india Team Won The Indian Match:
స్పోర్ట్స్

T20 Match: ఐర్లాండ్‌కి చుక్కలు చూపించిన భారత్

T20 Match irland Vs india Team Won The Indian Match: టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ విజృంభించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐర్లాండ్ విసిరిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 12.2 ఓవర్లలోనే చేధించి హౌరా అనిపించింది. తొలుత టీమిండియా పేసర్ల దెబ్బకు ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 రన్స్‌కే ఆలౌట్ అయింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌ ఏలో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. మెయిన్‌గా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

ఫలితంగా ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేక మేడలా కూలింది. హార్దిక్‌ పాండ్యా, అర్ష్‌దీప్‌ సింగ్‌, సిరాజ్‌, బుమ్రా, అక్షర్‌ పటేల్‌ ధాటికి ఐర్లాండ్‌ 96 రన్స్‌కే కుప్పకూలింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో లోర్గాన్‌ టక్కర్‌, కర్టిస్‌ క్యాంపర్‌, గెరాత్‌ డెలానీ, జాషువ లిటిల్‌ మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ, పాల్‌ స్టిర్లింగ్‌, హ్యారీ టెక్టార్‌, జార్జ్‌ డాక్రెల్‌, మార్క్‌ అదైర్‌, బ్యారీ మెక్‌ కార్తీ దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ అదిరిపోయే క్యాచ్ వీడియో ఇదిగో, డకౌట్‌గా పెవిలియన్ చేరిన ఐర్లాండ్ బ్యాటర్ మెక్‌కార్తీ అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే తడబడింది.

ఓపెన‌ర్‌గా వ‌చ్చిన విరాట్ కోహ్లీ(1) నిరాశ‌ప‌రిచాడు. మార్క్ అడైర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి బౌండ‌రీ వ‌ద్ద జెంజ‌మిన్ చేతికి దొరికాడు. అనంత‌రం రిష‌భ్ పంత్, రోహిత్ శ‌ర్మ‌ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. అర్థశతకం పూర్తయిన తరువాత రోహిత్ శర్మ రిటైర్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు రన్స్‌ చేసి పెవిలియన్ చేరాడు. చివరకు భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 12.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?