Sunrisers Hyderabad Won Second Victory
స్పోర్ట్స్

IPL 2024: సన్‌రైజర్స్‌ సెకండ్ విక్టరీ 

Sunrisers Hyderabad Won Second Victory : ఐపీఎల్ 2024 స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస విజ‌యాల‌తో నాన్‌ స్టాప్‌గా దూసుకుపోతుంది. శుక్ర‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ఘ‌న విజ‌యం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 165 రన్స్‌ చేసింది. ఈ టార్గెట్‌ను మ‌రో ప‌ద‌కొండు బాల్స్ మిగిలుండ‌గానే స‌న్‌రైజ‌ర్స్ ఛేదించింది.

సీఎస్‌కే టీమ్‌లో 45 ప‌రుగుల‌తో శివ‌మ్ దూబే టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ర‌హానే 35, జ‌డేజా 31 ప‌రుగులు చేసినా ధాటిగా ఆడ‌లేక‌పోయారు. అభిషేక్ శ‌ర్మ 37 ర‌న్స్‌, మార్‌క్ర‌మ్ 50 ర‌న్స్‌ మెరుపుల‌తో ఈ సింపుల్ టార్గెట్‌ను 18.1 ఓవ‌ర్ల‌లోనే స‌న్‌రైజ‌ర్స్ ఛేదించింది. ట్రావిస్ హెడ్ 31 ర‌న్స్ చేశాడు. ఈ మ్యాచ్‌తో స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ క‌మిన్స్ ఐపీఎల్‌లో యాభై వికెట్లు తీసిన ఆస్ట్రేలియ‌న్ బౌల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. షేన్ వార్న్ రికార్డును ఈక్వెల్‌ చేశాడు.

Also Read:అందుకే గెలవట్లేదని అంబటి సంచలన వ్యాఖ్యలు

ఇక స‌న్‌రైజ‌ర్స్‌, చెన్నై మ్యాచ్‌లో ప‌లువురు రాజ‌కీయనాయకులతో పాటుగా టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు సంద‌డి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సినీన‌టులు వెంక‌టేష్‌తో పాటు బ్ర‌హ్మానందం ప‌లువురు సెల‌బ్రిటీలు ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించారు.ఈ ఓట‌మితో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి సీఎస్‌కే ప‌డిపోయింది. ప్ర‌స్తుతం స‌న్‌రైజ‌ర్స్ ఐదో స్థానంలో ఉంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!