Sunil Chhetri Who Played The Last Match Of His Career On The Ground With Emotion: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను ఆడేశాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో కువైట్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ను భారత్ 0-0 తో డ్రా చేసుకుంది. అయితే సునీల్ ఛెత్రి చివరి మ్యాచ్ కావడంతో సాల్ట్ లేక్ స్టేడియం అంతా ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ఏకంగా ఈ మ్యాచ్‌కు 58వేల 291 మంది ఆడియెన్స్ అటెండెన్స్ నమోదైంది.
కాగా రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో జూన్ 11న భారత్ తన చివరి ఆటని ఖతార్‌తో తలపడనుంది. మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన సునీల్ ఛెత్రి గ్రౌండ్‌లోనే తన దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పటివరకు సునీల్ భారత జట్టు తరఫున 72 మ్యాచ్‌లు ఆడి 41 గోల్స్ చేశాడు. ఇది ఒక భారతీయుడి అత్యధిక స్కోరు. సునీల్ 2007,2009,2012లో నెహ్రూ కప్‌ను గెలుచుకోవడంతో పాటు 2008లో ఆసియా కప్‌కు కూడా అర్హత సాధించాడు. అతను భారత అత్యుత్తమ ఆటగాడు అనడంలో డౌట్ లేదు. సునీల్‌కు అర్జున్ అవార్డు వచ్చింది.అతను మూడుసార్లు ఐపా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.2021లో సునీల్ ఛెత్రి చరిత్ర సృష్టించాడు. అతను మాలేలో నేపాల్‌తో జరిగిన సాప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో గోల్ చేయడం ద్వారా గొప్ప బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలేను సమం చేశాడు. ఛెత్రీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పీలేతో సమానంగా 77 గోల్స్ చేశాడు.
2021లోనే, సునీల్ ఛెత్రి అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీని అధిగమించి యాక్టివ్ ప్లేయర్‌లలో అత్యధిక గోల్స్ చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. 2019లో పద్మశ్రీ అవార్డుతో ఛెత్రీని సత్కరించారు. ఛెత్రీకి 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. రెండు దశాబ్దాల పాటు 151 మ్యాచులు ఆడిన సునీల్ ఛెత్రి 94 గోల్స్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సునీల్ ఛెత్రి కంటే ముందు పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో, ఇరాన్‌కు చెందిన అలీ డేయి, అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ గోల్స్ చేసి ఉన్నారు. అయితే ఇన్నాళ్లు సునీల్ ఛైత్రి ఆటని ఎంజాయ్ చేసిన అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. చివరి మ్యాచ్ తనకి కావచ్చు కానీ, మాకు కాదని సునీల్ ఛైత్రిపై తమకున్న అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
.@IndianFootball will never be the same without you 🙏🏻🇮🇳
Thank you 🐐💙#OdishaFC pic.twitter.com/zsnEgb3TKm
— Odisha FC (@OdishaFC) June 6, 2024