Srh vs Csk Why Dhoni Was Came Out To Bat For Just 3 Balls Left Says Michael vaughan: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలకు తెర తీసింది ఈ ఓటమి. అంతేకాకుండా తను బ్యాటింగ్ సిచ్చువేషన్ సైతం దీనికి రీజన్ అయ్యాయి.గతరాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. శివం దుబే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. అజింక్య రహానె 35, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ టార్గెట్‌ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంకా 11 బాల్స్ మిగిలివుండగానే 166 రన్స్ చేసింది.
Also Read: సన్‌రైజర్స్ సెకండ్ విక్టరీ
ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగారు. 20వ ఓవర్ మూడో బంతికి డారిల్ మిఛెల్ అవుటైన తరువాత ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడు. రెండు బంతులను ఎదుర్కొని, ఒక్క పరుగే చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి మూడు బాల్స్ మిగిలి ఉన్న టైంలో అతను బ్యాటింగ్‌కు రావడం చర్చనీయాంశమైంది. మూడు బంతులే మిగిలే ఉన్న టైంలో ధోనీ బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడో తనకు అర్థం కావట్లేదని పేర్కొన్నాడు.
ఢిల్లీ కేపిటల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందే వచ్చాడని, 16 బంతుల్లో ధోనీ 37 పరుగులు చేశాడని గుర్తు చేశాడు. అదే వ్యూహాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఎందుకు అనుసరించలేదో తెలియట్లేదని మైఖేల్ వాన్ అన్నాడు. న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ సైమన్ డౌల్ కూడా ఇదే ఒపీనియన్‌ని రివీల్ చేశాడు. స్లోయర్ డెలివరీలను హార్డ్ హిట్ చేయగల సత్తా ధోనీకి ఉందని, ఇదివరకు మ్యాచ్‌ల్లో అది ప్రూవ్ అయిందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రాకపోవడం ఆశ్చర్యమేనని పేర్కొన్నాడు.