Spanish Team Registered hattrick Victory
స్పోర్ట్స్

Sports News: సరికొత్త రికార్డు

Spanish Team Registered hattrick Victory: యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మాజీ చాంపియన్‌ స్పెయిన్‌ జట్టు హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. గ్రూప్‌- బిలో భాగంగా అల్బేనియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 1–0 గోల్‌ తేడాతో గెలిచింది. ఆట 13వ నిమిషంలో స్పెయిన్‌ జట్టుకు ఫెరాన్‌ టోరెస్‌ ఏకైక గోల్‌ అందించాడు.

మూడు విజయాలతో స్పెయిన్‌ తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌-బి టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. గ్రూప్‌-బిలో భాగంగా క్రొయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇటలీ 1–1తో డ్రా చేసుకుంది. లూకా మోడ్రిచ్‌, ఇటలీ తరఫున జకాగ్ని ఒక్కో గోల్‌ చేశారు. యూరో టోర్నీ చరిత్రలో గోల్‌ చేసిన అతి పెద్ద వయస్కుడిగా మోడ్రిచ్‌ గుర్తింపు పొందాడు.

నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ జట్టు కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్‌ ‘డి’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–2తో నెదర్లాండ్స్‌ను ఓడించగా… ఫ్రాన్స్, పోలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ‘డి’ గ్రూప్‌ నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!